Road Accident: రోడ్డుపై BMW బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడి ఇద్దరు యువతులు మృతి! వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై హై స్పీడ్‌లో అడ్డదిడ్డంగా వెళ్తున్న ఓ బీఎండబ్బ్యూ కారు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువతులను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువతులు గాల్లోకి ఎగిరి అల్లంత దూరాన పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని ఆసుప్రతిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా..

Road Accident: రోడ్డుపై BMW బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడి ఇద్దరు యువతులు మృతి! వీడియో వైరల్
BMW hits scooter
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 16, 2024 | 6:50 AM

ఇండోర్, సెప్టెంబర్ 16: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై హై స్పీడ్‌లో అడ్డదిడ్డంగా వెళ్తున్న ఓ బీఎండబ్బ్యూ కారు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువతులను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువతులు గాల్లోకి ఎగిరి అల్లంత దూరాన పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని ఆసుప్రతిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఖజరానా గణేశ్‌ ఆలయాన్ని దర్శనానికి వెళ్లిన లక్ష్మీతోమర్‌ (24), దీక్ష జాదన్‌ (25)లు శనివారం రాత్రి స్కూటర్‌పై తిరిగి వస్తున్నారు. ఇంతలో రాంగ్‌ రూట్లో వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు వీరి స్కూటీని బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం ధాటికి వాహనంతో సహా ఇద్దరూ కొన్ని అడుగుల ఎత్తు వరకు ఎగిరి అల్లంత దూరాన పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతుల తలలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు అక్కడే వదిలేసి, డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికులు గాయపడిన వారిని హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తిని గజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ (28)గా గుర్తించారు. స్నేహితుడి పుట్టిన రోజు కావడంతో కేక్‌ ఇచ్చేందుకు వెళ్తున్నాడని, ఈ క్రమంలో రాంగ్‌ రూట్‌లో వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఖజ్రానా పోలీస్ స్టేషన్ ఛార్జ్ మనోజ్ సింగ్ సెంధవ్ తెలిపారు. కారు యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కాగా స్నేహితులు లక్ష్మీతోమర్‌, దీక్ష జాదన్‌ ఇద్దరూ ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో అంతులేని అవేదన చోటు చేసుకుంది. శివపురికి చెందిన లక్ష్మీతోమర్ తండ్రి గతేడాది మరణించాడు. అప్పటి నుండి కుటుంబ భారం భుజాన మోస్తుంది. ఇండోర్‌లో జాబ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వారి కుటుంబానికి ఏకైక ఆధారం కూడా కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక గ్వాలియర్‌కు చెందిన దీక్షా జాడోన్ ఇండోర్‌లోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.