Telangana: బాల్కొండ ఖిల్లాలో బాలుడి దారుణ హత్య.! ఎన్నో అనుమానాలు.. ఎంతకూ దొరకని క్లూ

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గర్తు తెలియని వ్యక్తులు పన్నెండేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా? లేదా డబ్బుల కిడ్నాప్‌ చేశార అనే విషయం ఇంకా తెలియరాలేదు.పోలీసులు తెలిపిన వివరాలివి.. బాల్కొండలోని చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన నచ్చు రాకేశ్‌ మేనమామ అయిన నాగాపూర్‌కు చెందిన దశరథ్‌ మేకలను.. అదే గ్రామానికి చెందిన..

Telangana: బాల్కొండ ఖిల్లాలో బాలుడి దారుణ హత్య.! ఎన్నో అనుమానాలు.. ఎంతకూ దొరకని క్లూ
Balkonda Boy Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 15, 2024 | 10:13 AM

బాల్కొండ, సెప్టెంబర్‌ 15: నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గర్తు తెలియని వ్యక్తులు పన్నెండేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా? లేదా డబ్బుల కిడ్నాప్‌ చేశార అనే విషయం ఇంకా తెలియరాలేదు.పోలీసులు తెలిపిన వివరాలివి.. బాల్కొండలోని చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన నచ్చు రాకేశ్‌ మేనమామ అయిన నాగాపూర్‌కు చెందిన దశరథ్‌ మేకలను.. అదే గ్రామానికి చెందిన బండి నరేందర్‌ మేతకు తీసుకుని వెళ్తుంటాడు. దీంతో రాకేశ్‌.. నరేందర్‌ కుటుంబ సభ్యులకు పరిచయమయ్యాడు. గణేశ్‌ చతుర్ధి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 11న నరేందర్‌, బాలుడు నచ్చు రాకేశ్‌ను తీసుకొన్ని బాల్కొండకు వెళ్లాడు. అయితే ఆ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా రాకేశ్‌ ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నరేందర్‌ను ప్రశ్నించారు. నరేందర్‌ పొంతనలేని సమాధానం చెప్పడంతో వారు బాల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి కోసం వేతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బాల్కొండలోని ఖిల్లా ప్రాంతంలో బాలుడి మృతదేహం కలకలం రేపింది. చిట్టాపూర్‌ గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాలుడి మృతదేహంపై దుస్తులు లేకపోవడంతోపాటు ఎడమ కంటి భాగంపై బండరాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి.

ఖిల్లాలోని ఓ గుహ ముందు హత్య చేసి మృతదేహాన్ని కొద్దిదూరంలో పారేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని నరేందర్‌ హత్య చేసి ఉంటాడని, కనిపించకుండా పోయిన రోజు నరేందర్‌తోనే బయటికి వెళ్లాడని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు నరేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అనుమానితుడు నేరాన్ని అంగీకరించకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

అయితే బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మాత్రం పోలీసు స్టేషన్‌కు చేరుకుని నరేందర్‌ను తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్య జరిగిన మర్నాడు నరేందర్‌ తన భార్య మొబైల్‌తో ఫోన్‌ చేసి, రాకేశ్‌ ఖానాపూర్‌ వద్ద ఉన్నాడని అబద్ధం చెప్పాడని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. హత్య జరిగిన రోజు ఉదయం నరేందర్‌ తొలుత బాలుడి అన్న మణికంఠకు ఫోన్‌చేసి ఖిల్లా వద్దకు రావాలన్నాడు. మణికంఠ వెళ్లకపోవడంతో రాకేశ్‌ను తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. కాగా నరేందర్‌ తండ్రి రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..