AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అత్తింటి ఆస్తిపై అల్లుడి కన్ను.. సిని ఫక్కీలో బావ మరిది హత్య! కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..

ఆన్‌లైన్‌ గేమ్‌లు, ఇతర వ్యవసనాలకు అలవాటు పడిన అల్లుడు అత్తింటి ఆస్తిపై కన్నేశాడు. ఆ ఆస్తికి వారసుడైన బావమరిదిని అంతమొందిస్తే అంతా తనకే దక్కుతుందని పగటి కలలు కన్నాడు. తుదకు నమ్మకంగా బావమరిదిని హత్య చేసి, సూసైడ్‌ అంటూ దొంగనాటకాలు ఆడాడు. పోలీసుల ఎంట్రీతో అసలు కథ బయటికొచ్చింది. గచ్చిబౌలి ఠాణా పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. శనివారం మాదాపూర్‌..

Hyderabad: అత్తింటి ఆస్తిపై అల్లుడి కన్ను.. సిని ఫక్కీలో బావ మరిది హత్య! కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..
Man Killed Wife's Younger Brother
Srilakshmi C
|

Updated on: Sep 15, 2024 | 8:40 AM

Share

రాయదుర్గం, సెప్టెంబర్‌ 15: ఆన్‌లైన్‌ గేమ్‌లు, ఇతర వ్యవసనాలకు అలవాటు పడిన అల్లుడు అత్తింటి ఆస్తిపై కన్నేశాడు. ఆ ఆస్తికి వారసుడైన బావమరిదిని అంతమొందిస్తే అంతా తనకే దక్కుతుందని పగటి కలలు కన్నాడు. తుదకు నమ్మకంగా బావమరిదిని హత్య చేసి, సూసైడ్‌ అంటూ దొంగనాటకాలు ఆడాడు. పోలీసుల ఎంట్రీతో అసలు కథ బయటికొచ్చింది. గచ్చిబౌలి ఠాణా పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. శనివారం మాదాపూర్‌ ఏసీపీ శ్రీకాంత్‌ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారానికి చెందిన గోగుల శ్రీకాంత్‌ (34) హైదరాబాద్‌లోని కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలో పీజీ హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు. 2017లో కావలికి చెందిన వ్యాపారి మద్దసాని ప్రకాశం తన కుమార్తె అమూల్యను శ్రీకాంత్‌కిచ్చి వివాహం జరిపించాడు. ప్రకాశం కుమారుడు యశ్వంత్‌ (25) బావ హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ పూర్తి చేసి, ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. యశ్వంత్‌ హాస్టల్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఓ గదిలో తన స్నేహితుడు మహేష్‌తో ఉంటూ హాస్టల్‌ నిర్వహణలో బావకు సహకరిస్తూ ఉండేవాడు. అయితే శ్రీకాంత్‌ వ్యసనాలకు అలవాటు పడి రూ.4కోట్లకుపైగా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చేందుకు శ్రీకాంత్‌ భార్య తల్లిదండ్రుల ఆస్తిపై కన్నేశాడు. బావ మరిది యశ్వంత్‌ను అంతమొందిస్తే అత్తామామల ఆస్తి తనకే దక్కుతుందని, దీనితో అప్పులు తీర్చి జల్సాగా బతకొచ్చని కుట్ర పన్నాడు. దీంతో నమ్మకంగా బావమరిదిన చంపేందుకు పన్నాగం పన్నాడు.

అందుకు కర్ణాటక కర్వార్‌ జిల్లా అంజయ్యనగర్‌లో వంట పనిచేసే పులియశ్రమానే ఆనంద్‌ (35), హాస్టల్‌ సూపర్‌వైజర్‌ అంబటి వెంకటేశ్‌లను సంప్రదించి హత్యాకుట్రను చెప్పాడు. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌ కింద రూ.2లక్షలిచ్చాడు. ఆగస్టు 29న యశ్వంత్‌ ఉండే హాస్టల్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లోని సీసీటీవీ కెమెరాలు ఆఫ్‌ చేసి, యశ్వంత్‌ స్నేహితుడు మహేష్‌ను 31న బయటికి పంపించేశాడు. సెప్టెంబర్‌ 1న అర్ధరాత్రి 12.45కు ఆనంద్, వెంకటేశ్‌ గదిలోకి ప్రవేశించి.. యశ్వంత్‌ కాళ్లు, చేతులు కట్టేసి చున్నీతో గొంతుకు ఉచ్చు బిగించి చంపేశారు. యశ్వంత్‌ 90 కిలోల బరువు ఉండడంతో ఉరికి వేలాడదీయడం కష్టం అయ్యింది. దీంతో ఉరి నుంచి దించుతున్నట్లు ఫొటోలు తీశారు. వ్యసనాలతో బావమరిది ఆత్మహత్య చేసుకున్నట్లు అత్తామామలకు కొత్త అల్లి చెప్పాడు శ్రీకాంత్‌. అదేరోజు కారులో మృతదేహాన్ని తీసుకొని కావలికి బయల్దేరాడు. అత్తాగారింట్లో తొందరపెట్టి దహన సంస్కారాలు చేయించాడు. అయితే ఖననం సమయంలో మృతదేహంపై గాయాలు చూసిన ప్రకాశం, హాస్టల్‌ సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా అనుమానాలు బలపడ్డాయి. వెంటనే ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా శ్రీకాంత్‌ నేరం అంగీకరించాడు. హత్యకు సహకరించిన నిందితులను కూడా అరెస్టు చేసి రూ.90 వేల నగదు, 4 ఫోన్లు, ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.