AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Lawcet 2024 Counselling: న్యాయ విద్య ప్రవేశాలకు చివరి అవకాశం.. ఈ నెల 17 నుంచి లాసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షురూ

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. లాసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 17 నుంచి ప్రారంభమవుతుందని ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్ పి.రమేశ్‌బాబు తెలిపారు. ఇప్పటి వరకు సీటు పొందని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు..

TG Lawcet 2024 Counselling: న్యాయ విద్య ప్రవేశాలకు చివరి అవకాశం.. ఈ నెల 17 నుంచి లాసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షురూ
TG Lawcet 2024 Counselling
Srilakshmi C
|

Updated on: Sep 15, 2024 | 7:10 AM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. లాసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 17 నుంచి ప్రారంభమవుతుందని ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్ పి.రమేశ్‌బాబు తెలిపారు. ఇప్పటి వరకు సీటు పొందని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 17 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక సెప్టెంబరు 30న సీట్లు కేటాయిస్తారు. తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మూడేళ్లు ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో రాష్ట్రంలోని పలు న్యాయ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అధికార వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

‘ప్రతి తరగతి గదిలో హాజరు రాయాలి’ ఏపీ విద్యాశాఖ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ విద్యార్థుల హాజరును బోర్డుపై నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ పార్వతి ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్‌ బోర్డుపై కుడివైపున మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది గైర్హాజరు వంటి వివరాలను ఏ రోజుకారోజు ప్రదర్శించాలని సూచించారు. ప్రైవేటు బడులతో పాటు అన్ని యాజమాన్యాలు దీన్ని అనుసరించాలని ఆదేశించారు.

తెలంగాణ ఐసెట్‌ తొలి విడత కౌన్సెలింగులో 24,457కి సీట్లు కేటాయింపు

తెలంగాణ ఐసెట్‌ తొలి విడత కౌన్సెలింగులో సీట్లు కేటాయింపు పూర్తైంది. ఇందులో ఎంబీఏలో 87.5 శాతం, ఎంసీఏలో 86 శాతం సీట్లను కేటాయించారు. రాష్ట్రంలోని మొత్తం 266 ఎంబీఏ కాలేజీల్లో 27,951 సీట్లు అందుబాటులో ఉండగా, వాటిలో 24,457 సీట్లు భర్తీ అయ్యాయి. 89 ఎంసీఏ కాలేజీల్లో 6,797 సీట్లకు గాను వాటిలో 5,843 సీట్లు భర్తీ అయ్యాయని కన్వీనర్‌ శ్రీదేవసేన పేర్కొన్నారు. ఇక రెండు కోర్సుల్లో కలిపి మొత్తం 34,748 సీట్లకుగానూ 30,300 సీట్లు అంటే 87.2 శాతం భర్తీ అయ్యాయని తెలిపారు. మిగిలిన 4,448 సీట్లను రెండో విడతలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థుల్లో 1,130 మంది ఈడబ్ల్యూఎస్‌ కోటాలో దక్కించుకున్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 17వ తేదీలోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. సెప్టెంబర్‌ 25 నుంచి 28వ తేదీల మధ్య కాలేజీలకు స్వయంగా హాజరై టీసీలు సమర్పించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్
పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..?
ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..?
ఆ హీరోయిన్‌తో ధనుష్ ప్రేమాయణం..పెళ్లి డేట్ కూడా
ఆ హీరోయిన్‌తో ధనుష్ ప్రేమాయణం..పెళ్లి డేట్ కూడా
ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే..
ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే..