AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Authentication to SSC: ‘ఇకపై మోసాలకు పాల్పడితే తాటతీసుడే’ యూపీఎస్సీతోపాటు ఎస్‌ఎస్‌సీకీ ‘ఆధార్‌ వెరిఫికేషన్‌’ అనుమతి

ఉద్యోగ రిజిస్ట్రేషన్ సమయంలో, వివిధ దశల పరీక్షలు నిర్వహించేందుకు, రిక్రూట్‌మెంట్ సమయంలో అభ్యర్థుల గుర్తింపును స్వచ్ఛందంగా ధృవీకరించడానికి ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను నిర్వహించడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)ని కేంద్రం అనుమతి ఇచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇదే విధమైన ధృవీకరణను నిర్వహించడానికి అనుమతించిన 15 రోజుల తర్వాత అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌..

Aadhaar Authentication to SSC: 'ఇకపై మోసాలకు పాల్పడితే తాటతీసుడే' యూపీఎస్సీతోపాటు ఎస్‌ఎస్‌సీకీ ‘ఆధార్‌ వెరిఫికేషన్‌’ అనుమతి
Aadhaar Authentication to SSC
Srilakshmi C
|

Updated on: Sep 15, 2024 | 8:09 AM

Share

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15: ఉద్యోగ రిజిస్ట్రేషన్ సమయంలో, వివిధ దశల పరీక్షలు నిర్వహించేందుకు, రిక్రూట్‌మెంట్ సమయంలో అభ్యర్థుల గుర్తింపును స్వచ్ఛందంగా ధృవీకరించడానికి ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను నిర్వహించడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)ని కేంద్రం అనుమతి ఇచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇదే విధమైన ధృవీకరణను నిర్వహించడానికి అనుమతించిన 15 రోజుల తర్వాత అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ సంస్థ అయిన స్టాఫ్‌ సర్విస్‌ కమిషన్‌కు కూడా కేంద్రం అనుమతులు జారీ చేసింది. యూపీఎస్సీకి ఆగస్టు 28న తొలిసారి కేంద్రం ఈ విధమైన అనుమతి ఇచ్చింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గుర్తింపును తనిఖీ చేసేందుకు వీలుగా ‘ఆధార్‌ వెరిఫికేషన్‌’ ఉపయోగపడుతుంది. దీనివల్ల దరఖాస్తు సమయంలోనూ, వివిధ స్థాయిల్లోనూ వెరిఫికేషన్‌ సులభతరం కానుంది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని నాన్-గెజిటెడ్ పోస్టులకు నియామకాలు చేపట్టే SSC.. అతిపెద్ద రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలలో ఒకటి.

ఆధార్ అనేది బయోమెట్రిక్ మరియు డెమోగ్రాఫిక్ డేటా ఆధారంగా అర్హత ఉన్న పౌరులందరికీ UIDAI జారీ చేసిన 12 అంకెల సంఖ్య. ఉద్యోగ నియామక పరీక్ష సమయంలో అభ్యర్థులు తమ అర్హతకు మించి SSC, UPSC నిర్వహించే రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరు కావడానికి అభ్యర్థులు తమ గుర్తింపును దాచేందుకు యత్నించకుండా నివారిస్తుంది. రెండు సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహించే రిక్రూట్‌మెంట్ పరీక్షలకు లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. తాజాగా ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌ వ్యవహారం బయటకు రావడంతో ఈ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కేటగిరీలో వికలాంగుల కోటా కింద తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మోసపూరితంగా కొలువు దక్కించుకుంది. దీనిపై విచారణ చేపట్టిన యూపీఎస్సీ ఆమె ఐఏఎస్‌ సర్వీస్‌ను రద్దు చేసింది. భవిష్యత్తులో ఏ పరీక్షలు రాయకుండా డీబార్‌ చేసింది.

‘మదర్సాలు విద్యాబోధనకు పనికిరావు’ సుప్రీంకోర్టులో ఎన్‌సీపీసీఆర్‌ వెల్లడి

విద్య నేర్చుకోవడానికి మదర్సాలు పనికిరావని, అక్కడ బోధించే విద్య.. విద్యార్థులకు ఎందుకూ పనికిరాదని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) సుప్రీంకోర్టుకు తెలిపింది. మదర్సాల్లో బోధించే విద్య.. విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ)లోని సెక్షన్లు 19, 21, 22, 24, 29కి విరుద్ధంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. మదర్సాలు ఆర్‌టీఈ పరిధిలోకి రాకపోవడం వల్ల.. అక్కడ మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు వంటి విద్యా హక్కులకు విద్యార్థులు దూరం అవుతున్నారని కోర్టుకు విన్నవించింది. పైగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో కొన్ని అంశాలను మాత్రమే బోధిస్తున్నారని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇవ్వడం లేదని, విద్య పేరిట మదర్సాలు మోసం చేస్తున్నాయని తెలిపింది. ఈ మేరకు కోర్టు ముందు దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఎన్‌సీపీసీఆర్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.