Telangana: వైద్య కాలేజీల్లో ప్రవేశాలకు స్థానికతపై తేలని పంచాయితీ.. రేపు సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు రాష్ట్ర వైద్య, దంత వైద్య కాలేజీల్లో అవకాశం కల్పించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్‌ 5న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని మంగళవారం (సెప్టెంబర్ 17) సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం విచారించనుంది..

Telangana: వైద్య కాలేజీల్లో ప్రవేశాలకు స్థానికతపై తేలని పంచాయితీ.. రేపు సుప్రీంకోర్టులో విచారణ
Supreme Court
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 16, 2024 | 7:13 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16: తెలంగాణలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు రాష్ట్ర వైద్య, దంత వైద్య కాలేజీల్లో అవకాశం కల్పించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్‌ 5న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని మంగళవారం (సెప్టెంబర్ 17) సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం విచారించనుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలు అంతకంత ఆలస్యం అవుతుండటంతో.. దీనిపై త్వరగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు సెప్టెంబర్ 12న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని కోరింది. అందుకు సీజేఐ సమ్మతి తెలపడంతో రేపు ధర్మాసనం ఈ పిటిసన్‌ విచారించనుంది.

ఓయూలో వివిధ కోర్సుల పరీక్షా తేదీలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ రాములు విడుదల చేశారు. ఈ మేరకు శనివారం (సెప్టెంబరు 14) ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు నాలుగు, ఆరు, ఎనిమిదో సెమిస్టర్‌ రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌ పరీక్షలను సెప్టెంబరు 20వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మాస్టర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎంఎంఎస్‌) మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలను 23 నుంచి, బీఫార్మసీ (పీసీఐ) రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌ మెయిన్, అన్ని సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలను సెప్టెంబరు 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇతర పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని ఆయన విద్యార్ధులకు సూచించారు.

ఓయూ పరిధిలోని బీఈ కోర్సు పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ రాములు తెలిపారు. బీఈ (నాన్‌ సీబీసీఎస్‌), బీఈ (సీబీసీఎస్‌) పరీక్షా ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..