Building Collapse: ఒక్కసారిగా కుప్ప కూలిన మూడంతస్తుల భవనం.. ఒకే కుటుంబానికి చెందిన10 మంది సజీవ సమాధి!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని జాకీర్‌ కాలనీలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుంటి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో 10 మంది సజీవ సమాధి అయ్యారు. మీరట్‌లోని జాకీర్‌ కాలనీలో భవనం కూలిపోయింది. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను వెలికి తీయగా.. తీవ్రంగా గాయపడిన 5 మందిని ఆస్పత్రులకు తరగించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు..

Building Collapse: ఒక్కసారిగా కుప్ప కూలిన మూడంతస్తుల భవనం.. ఒకే కుటుంబానికి చెందిన10 మంది సజీవ సమాధి!
Meerut Building Collapse
Follow us

|

Updated on: Sep 15, 2024 | 12:27 PM

లక్నో, సెప్టెంబర్‌ 15: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని జాకీర్‌ కాలనీలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుంటి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో 10 మంది సజీవ సమాధి అయ్యారు. మీరట్‌లోని జాకీర్‌ కాలనీలో భవనం కూలిపోయింది. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను వెలికి తీయగా.. తీవ్రంగా గాయపడిన 5 మందిని ఆస్పత్రులకు తరగించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శిథిలాలను తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యాయి.

శిథిలాల కింద మరో 14 మంది చిక్కుకుపోయారని జిల్లా కలెక్టర్‌ దీపక్‌ మీనా వెల్లడించారు. వారిలో ఎనిమిది మందిని రక్షించామన్నారు. మిగిలిగినవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. జాకీర్ కాలనీలో 50 ఏళ్లనాటి శిథిలావస్థకు చేరిన భవనం కింది అంతస్తులో డెయిరీ సంస్థను నిర్వహిస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. అదే భవనంలో పశువులు కూడా ఉండటంతో శిధిలాల కింద అవన్నీ చిక్కుకున్నాయి. స్నిఫర్ డాగ్‌లు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. రెస్క్యూ టీమ్‌లు, స్థానిక వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్‌ను ఈ రోజు తెల్లవారుజాము 2 గంటల వరకు కొనసాగించారు. తిరిగి ఈ ఉదయం రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభమైంది. ఇల్లు ఇరుకైన సందులో ఉందని, బుల్డోజర్లు లోపలికి ప్రవేశించలేని విధంగా ఉన్నాయని, అందుకే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కుటుంబం అక్కడ పాల వ్యాపారం చేస్తుందని, ఈ ప్రమాంలో నాలుగు నుండి ఐదు వరకు శిధిలాల కింద చిక్కుకుని పశువులు చనిపోయి ఉంటాయని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డికె ఠాకూర్ మీడియాకు తెలిపారు.

మృతులను నఫీసా (63), ఫర్హానా (20), అలీసా (18), సాజిద్ (40), సానియా (15), సాకిబ్ (11), సిమ్రాన్ (15 నెలలు), ఆలియా (6), రిజా (7)గా గుర్తించారు, రిమ్సా (5 నెలలు)గా గుర్తించారు. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
ఆరు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఆరు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఒకే షోలో ఎన్టీఆర్, రోహిత్ శర్మ.. హంగామా మామలులుగా లేదుగా.. వీడియో
ఒకే షోలో ఎన్టీఆర్, రోహిత్ శర్మ.. హంగామా మామలులుగా లేదుగా.. వీడియో
విజయ్ పొలిటికల్ జర్నీలో బీజేపీ పాత్ర ఏంటి...?
విజయ్ పొలిటికల్ జర్నీలో బీజేపీ పాత్ర ఏంటి...?
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
నా కొడుక్కి డెంగ్యూ, కూతురిని కూడా కోల్పోయా.. కార్యదర్శే బాధ్యుడు
నా కొడుక్కి డెంగ్యూ, కూతురిని కూడా కోల్పోయా.. కార్యదర్శే బాధ్యుడు
ఈ చిన్నారి 13 ఏళ్లకే హీరోయిన్ అయ్యింది.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ చిన్నారి 13 ఏళ్లకే హీరోయిన్ అయ్యింది.. ఎవరో గుర్తు పట్టారా?
ఏపీలో పాఠశాలలకు వరుస సెలవులు..
ఏపీలో పాఠశాలలకు వరుస సెలవులు..
ఈ కారణాలతోనే ఆడవారు వేగంగా బరువు పెరుగుతారు.. జాగ్రత్త!
ఈ కారణాలతోనే ఆడవారు వేగంగా బరువు పెరుగుతారు.. జాగ్రత్త!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!