Cigarette: సిగరేట్ కోసం లొల్లి.. ఇద్దరిని కత్తితో పొడిచి పరారైన మందుబాబు

సిగరేట్‌ కోసం ఓ అంగతకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిచాడు. ఈ షాకింగ్‌ ఘటన బెంగళూరులోని నీలసంద్రలోని బజార్‌ స్ట్రీట్‌లోని ఓ బార్‌లో చోటు చేసుకుంది. అశోక్ నగర్ పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బెంగళూరులోని వివేక్‌ నరగ్‌లో నివాసం ఉంటున్న రమేష్‌ ప్రభు (36), రాజా (30) మంచి స్నేహితులు. రమేష్‌ దోమలూరులోని ఐటీ సంస్థలో ట్రావెల్‌ కన్సల్టెంగ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు..

Cigarette: సిగరేట్ కోసం లొల్లి.. ఇద్దరిని కత్తితో పొడిచి పరారైన మందుబాబు
Dispute Over Cigarette
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 13, 2024 | 11:00 AM

బెంగళూరు, సెప్టెంబర్ 13: సిగరేట్‌ కోసం ఓ అంగతకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిచాడు. ఈ షాకింగ్‌ ఘటన బెంగళూరులోని నీలసంద్రలోని బజార్‌ స్ట్రీట్‌లోని ఓ బార్‌లో చోటు చేసుకుంది. అశోక్ నగర్ పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బెంగళూరులోని వివేక్‌ నరగ్‌లో నివాసం ఉంటున్న రమేష్‌ ప్రభు (36), రాజా (30) మంచి స్నేహితులు. రమేష్‌ దోమలూరులోని ఐటీ సంస్థలో ట్రావెల్‌ కన్సల్టెంగ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక రాజా మరో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరూ సోమవారం రాత్రి 8 గంటలకు యశస్విబార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వచ్చారు.

రమేష్‌, రాజు సాయంత్రం బార్‌లో కలుసుకున్నారు. వారు మద్యం తాగుతూ, ఒకే సిగరెట్ ఇద్దరూ షేర్ చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి రమేష్‌ ప్రభు వద్దకు వెళ్లి వారు తాగుతున్న సిగరెట్‌ను అడిగాడు. రమేష్‌ నిరాకరించాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్డాడు. కౌంటర్‌లో మరో సిగరెట్ కొనుక్కోమని రమేష్‌ సలహా ఇచ్చాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం వారు కాల్చిన సిగరెట్ మాత్రమే తనకు కావాలని పట్టుబట్టాడు. దీంతో రమేష్‌, సదరు వ్యక్తి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దుర్భాషలాడుకుంటూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కొద్ది సేపటి అనంతరం ఆ వ్యక్తి బార్ నుండి వెళ్లిపోయాడు. అంతటితో గొడవ సర్దుమనిందనే అందరూ అనుకున్నారు.

కానీ అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో రమేష్‌, రాజా బార్ నుంచి బయటికి వస్తుండగా.. అక్కడే మాటు వేసి ఉన్న ఆ వ్యక్తి వారిపై మళ్లీ కయ్యానికి కాలుదువ్వాడు. దుర్భాషలాడుతూ వారిని రెచ్చగొట్టాడు. అనంతరం అతని వద్ద ఉన్న కత్తితో రమేష్‌ కడుపులో పొడిచాడు. అడ్డుకోబోయిన రాజాపై కూడా దాడి చేసి, కత్తితో పొడిచాడు. దీంతో రాజా బాధతో కింద పడిపోయాడు. అనంతరం రమేష్‌ను మళ్లీ కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన రమేష్‌, రాజాను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. రమేష్‌ ఫిర్యాదు మేరకు నిండితుడిపై కేసు నమోదు చేసుకున్నామని, అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఓ సీనియర్‌ పోలీసధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు