AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ‘దేవర సినిమా చూసి చచ్చిపోతా..’ క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక

జూనియర్‌ ఎన్టీఆర్‌ లేటెస్ట్ మువీ 'దేవర' చూసేంత వరకు బతికించండంటూ 19 యేళ్ల యువకుడు వైద్యులను వేడుకుంటున్నాడు. బ్లడ్‌ కేన్సర్‌ రోజురోజుకీ ఆయువును కబలిస్తుంటే.. ఎన్టీఆర్‌ వీరాభిమాని అయిన సదరు యువకుడు మాత్రం చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని, అదే తన చివరి కోరిక అని తల్లిదండ్రులను కోరాడు. కుమారుడి వేదన చూడలేక 'నా బిడ్డను బతికించండయ్యా' అంటూ ఆ యువకుడి తల్లి కన్నీరుమున్నీరుగా,,

Watch Video: 'దేవర సినిమా చూసి చచ్చిపోతా..' క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక
Cancer Patient Wish
Srilakshmi C
|

Updated on: Sep 12, 2024 | 11:45 AM

Share

తిరుపతి, సెప్టెంబర్‌ 12: జూనియర్‌ ఎన్టీఆర్‌ లేటెస్ట్ మువీ ‘దేవర’ చూసేంత వరకు బతికించండంటూ 19 యేళ్ల యువకుడు వైద్యులను వేడుకుంటున్నాడు. బ్లడ్‌ కేన్సర్‌ రోజురోజుకీ ఆయువును కబలిస్తుంటే.. ఎన్టీఆర్‌ వీరాభిమాని అయిన సదరు యువకుడు మాత్రం చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని, అదే తన చివరి కోరిక అని తల్లిదండ్రులను కోరాడు. కుమారుడి వేదన చూడలేక ‘నా బిడ్డను బతికించండయ్యా’ అంటూ ఆ యువకుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌కు టీటీడీలో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్‌ (19). కౌశిక్‌కు బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలడంతో 2022 నుంచీ చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ యువ‌కుడు బెంగ‌ళూరులోని కిడ్‌వై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తాను ఎప్పుడు చనిపోతానో తెలియ‌దని, తార‌క్ దేవ‌ర సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు.. అంటే సెప్టెంబ‌ర్ 27వ తేదీ వ‌ర‌కు త‌న‌ను బ‌తికించాల‌ని డాక్టర్లను వేడుకుంటున్నాడు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

‘నా బిడ్డ జూనియర్‌ ఎన్టీయార్‌కు వీరాభిమాని. దేవర సినిమా చూసి చచ్చిపోతానని అంటున్నాడు. సెప్టెంబర్‌ 27వ తేదీ దాకా బతికించండని డాక్టర్లను వేడుకుంటున్నాడని తల్లి కన్నీరు పెట్టుకుంది. తన కుమారుడి బోన్‌ మారో ట్రీట్‌మెంట్‌కు రూ.60 లక్షలు ఖర్చ అవుతుందని, దాతలు సహాయం చేయాలని వేడుకుంది. తన బిడ్డ చివ‌రి కోరిక తీర్చాలని, చంద్రబాబు, పవన్, జూనియర్‌ ఎన్టీఆర్ స్పందించాలని అతని తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ.. ఎన్టీఆర్‌ను ట్యాగ్‌ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.దాతలు ఎవరైనా సాయం చేసేందుకు ముందుకు వస్తే 9490829381 ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా గానీ లేదంతే కె.సరస్వతి, యూనియన్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నంబరు 103310100044506 (IFSC UBIN0801313)కు సాయం అందించవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 79956 65169 ఫోన్‌ నంబరు ద్వారా కౌశిక్‌ తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.