Viral Video: స్కూల్లో పిల్లల ముందు డ్యాన్స్‌ చేస్తూ రెచ్చిపోయిన టీచరమ్మ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు! వీడియో

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఓ మహిళా టీచరమ్మ చేసిన పనికి అందరూ విస్తు పోతున్నారు. ఎదురుగా సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో పెట్టి, సిగ్గుమాలిన పాటకు డ్యాన్స్‌ చేస్తూ రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది...

Viral Video: స్కూల్లో పిల్లల ముందు డ్యాన్స్‌ చేస్తూ రెచ్చిపోయిన టీచరమ్మ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు! వీడియో
Female Teacher Dance
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 11, 2024 | 10:59 AM

గతంలో ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో విద్యార్ధులు గురువులకు సత్కారం చేసేవారు. ఆ రోజు విద్యార్ధులు గురుపూజ్యోత్సవం గురించి ప్రసంగాలు చేస్తూ, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. అయితే నేటి కాలంలో టీచర్స్‌ డేకు అర్ధాలు వేరేలా ఉన్నాయి. విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే.. తరగతి గదుల్లో పిల్లల ముందు అశ్లీల పాటలకు నృత్యాలు చేస్తూ చెడిపోవడానికి బాటలు వేస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఓ మహిళా టీచరమ్మ చేసిన పనికి అందరూ విస్తు పోతున్నారు. ఎదురుగా సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో పెట్టి, సిగ్గుమాలిన పాటకు డ్యాన్స్‌ చేస్తూ రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఓ మహిళా టీచర్ తరగతి గది మధ్యలో డ్యాన్స్‌ చేస్తూ కనిపిస్తుంది. చుట్టూ ఆ స్కూల్లోని ఇతర ఉపాధ్యాయులు, విద్యార్ధులు కూర్చుని కనిపిస్తారు. మధ్యలో నల్లటి చీర ధరించిన టీచరమ్మ ఇటీవల తమన్నా నటించిన స్త్రీ2 మువీలోని ‘ఆజ్ కి రాత్..’ పాటకు కుప్పిగంతులు వేస్తూ కనిపిస్తుంది. అసభ్యకరమైన డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌, అనుచితమైన వస్ర్తధారణతో ఆమె డ్యాన్స్‌ చేస్తుంటే.. చుట్టూ ఉన్న విద్యార్థులు ఆమె డ్యాన్స్‌ ప్రదర్శనను కన్నార్ప కుండా చూస్తూ కూర్చోవడం వీడియోలో చూడవచ్చు. కేవలం ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయస్సు గల పిల్లల ముందు ఇలాంటి డ్యాన్స్‌ చేసిన టీచర్‌ను అక్కడే ఉన్న ఇతర టీచర్లు ఎంకరేజ్‌ చేయడం కొసమెరుపు. రెండు రోజుల క్రితం ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. పిల్లల ఎదుట అదీ తరగతి గదిలో ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో అశ్లీల డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌ చేస్తున్న మహిళా టీచర్‌ వాలకాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఉపాధ్యాయ వృత్తికే ‘సిగ్గుచేటు’ అని మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి పాటకు అదీ..ఉపాధ్యాయ దినోత్సవం నాడు పిల్లల ఎదుట డ్యాన్స్‌ చేయడం ఏంటని ఏకి పారేస్తున్నారు. ఇలాంటి టీచర్లు ఉన్న పాఠశాలల్లో విలువలు ఎక్కడ నుండి వస్తాయి? అని ఓ యూజర్‌ కామెంట్ సెక్షన్ లో ప్రశ్నించారు. మీరే ఆలోచించండి.. నేటి కాలం చదువులే ఏ స్థాయిలో ఉన్నాయో? ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భోజ్‌పురి పాటలతో డ్యాన్స్ చేయండి అని మరో యూజర్‌ వ్యాంగ్యాస్రాలు విసిరాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై నెట్టింట తీవ్ర చర్చ సాగుతుంది. పలువురు టీచర్‌ ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.