AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ భూన్యా ఇద్దరూ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు. సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది. దీనికి ముందు, ఈడీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నుండి బెయిల్ కూడా పొందారు. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో..

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌
Arvind Kejriwal
Subhash Goud
|

Updated on: Sep 13, 2024 | 11:33 AM

Share

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ భూన్యా ఇద్దరూ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు. సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది. దీనికి ముందు, ఈడీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నుండి బెయిల్ కూడా పొందారు. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే ఈ కేసు సీబీఐ చేసిన అరెస్ట్, రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించినది. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు జులై 12న సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. అదే సమయంలో ఇప్పుడు సీబీఐ కేసులో కూడా కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన అనంతరం జూన్ 26న తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టు అయ్యారు.

సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌:

ఇవి కూడా చదవండి

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది.

ఐదున్నర నెలల పాటు తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ చట్ట విరుద్దం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. అలాగే లిక్కర్‌ కేసుపై మాట్లాడవద్దని సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌కు అదేశించింది. అలాగే బెయిల్‌ మంజూరు చేస్తూ రూ.10 లక్షల బాండ్‌ను సమర్పించాలని షరతు విధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ