UP Rains: యూపీలో భారీ వర్షాలు 10 మంది మృతి, జనజీవనం అస్తవ్యస్తం.. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక
రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్, అధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలపై 24 గంటల పర్యవేక్షణ కోసం ఫ్లడ్ పిఎసి, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను అవసరానికి అనుగుణంగా మోహరించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో సగటున 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 51 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. గత 24 గంటల్లో వర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో 10 మంది మరణించారు. మెయిన్‌పురి జిల్లాలో ఐదుగురు, జలౌన్, బండాలో ఇద్దరు, ఎటాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం అవధ్, రోహిల్‌ఖండ్ ప్రాంతాల్లోని డజనుకు పైగా జిల్లాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు 19 రాష్ట్రాల్లో పిడుగులు, బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్, అధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలపై 24 గంటల పర్యవేక్షణ కోసం ఫ్లడ్ పిఎసి, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను అవసరానికి అనుగుణంగా మోహరించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో సగటున 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 51 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. హత్రాస్ జిల్లాలో అత్యధికంగా 185.1 మిమీ వర్షపాతం నమోదైంది. IMD ప్రకారం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
యూపీలో ఒత్తిడి పెరిగి కురుస్తున్న భారీ వర్షాలు
ఉత్తరప్రదేశ్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతాల్లోని ఒత్తిడే కారణం. వాతావరణ శాఖ ప్రకారం బుధవారం నైరుతి ఉత్తరప్రదేశ్.. పరిసర ప్రాంతాల్లో ఒత్తిడి ఉంది. ఇది గంటకు 10 కి.మీ వేగంతో తూర్పు-ఈశాన్య దిశగా కదిలి గురువారం మధ్య ఉత్తరప్రదేశ్‌లో షాజహాన్‌పూర్‌కు నైరుతి దిశలో 70 కి.మీ, హర్దోయ్‌కు పశ్చిమాన 90 కి.మీ, బరేలీకి దక్షిణంగా 100 కి.మీ, తూర్పు-దక్షిణంగా 130 కి.మీ -తూర్పు, ఆగ్రాకు తూర్పు-ఈశాన్యంగా 130 కి.మీలో ఉంది. ఇది తూర్పు-ఈశాన్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 12న తన తీవ్రతను కొనసాగించి శుక్రవారం నుంచి క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ ఢిల్లీ, లక్నోలో ఉన్న డాప్లర్ వాతావరణ రాడార్‌ల నిరంతర పర్యవేక్షణలో ఉంది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని ముజఫర్‌నగర్, మీరట్, అమ్రోహా, షాజహాన్‌పూర్, సంభాల్, బదౌన్, బరేలీ, పిలిభిత్, బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్, సిద్ధార్థనగర్, గోండా, బల్‌రాంపూర్, శ్రావస్తి, బహ్రైచ్, లఖింపూర్ ఖేరీ, సహారన్‌పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆగ్రా, మథుర, హత్రాస్, ఎటా, కస్గంజ్, ఫిరోజాబాద్, అలీగఢ్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..