Hyderabad Metro: 3 గంటల్లో హైదరాబాద్ మెట్రో చుట్టేసి గిన్నిస్ రికార్డు.. అసలతని ఆలోచన తెలిస్తే సెల్యూట్ చేస్తారు
ఢిల్లీకి చెందిన అకడమిక్ రీసెర్చర్ శశాంక్ మను హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లన్నింటినీ అతి తక్కువ సమయంలో ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. కేవలం 2 గంటల, 41 నిమిషాల, 31 సెకన్లలో హైదరాబాద్ కారిడార్‌లలోని మొత్తం 57 మెట్రో స్టేషన్‌లను శశాంక్ సందర్శించాడు. ఈ రికార్డును కలిగి ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లలో అత్యంత వేగంగా ప్రయాణించిన..
హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఢిల్లీకి చెందిన అకడమిక్ రీసెర్చర్ శశాంక్ మను హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లన్నింటినీ అతి తక్కువ సమయంలో ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. కేవలం 2 గంటల, 41 నిమిషాల, 31 సెకన్లలో హైదరాబాద్ కారిడార్‌లలోని మొత్తం 57 మెట్రో స్టేషన్‌లను శశాంక్ సందర్శించాడు. ఈ రికార్డును కలిగి ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లలో అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా గతంలోనూ ఇతనిపై రికార్డు ఉంది. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ మెట్రో రైలు స్టేషన్లన్నింటినీ 15 గంటల 22 నిమిషాల్లో ప్రయాణించాడు. జనవరి 15న ఈ రికార్డు ప్రయత్నం చేసాడు. అది పబ్లిక్ హాలిడే అయినందున ఆఫీసులకు వెళ్లేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు శశాంక్ మను మెట్రో నగరాల్లో ఇలా ప్రయాణాలు చేస్తున్నారు.
దీనిపై శశాంక్ మాట్లాడుతూ.. నేను మెట్రో రైలు ఔత్సాహికుడిని. ఇది పట్టణ ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రయత్నం. హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్‌లోని అన్ని స్టేషన్‌లను ఒకే మారథాన్ ట్రిప్‌లో ప్రయాణించడానికి నాకు మొత్తం 2 గంటల 41 నిమిషాల 31 సెకన్ల సమయం పట్టిందని మీడియాకు తెలిపాడు. హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్ మొత్తం మూడు కారిడార్‌ల మీదుగా దాదాపు 69.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మొత్తం 3 కారిడర్లలో మెట్రో సేవలు అందిస్తోంది. ఇంటర్-మోడల్ కనెక్టివిటీ, స్కైవాక్‌లతో కూడిన సమగ్ర పట్టణ రవాణా అభివృద్ధి ప్రాజెక్ట్ ఇది. సుదీర్ఘకాలం పాటు మెట్రో నెట్‌వర్క్‌లో ప్రయాణించడానికి శశాంక్ ‘సూపర్ సేవర్ హాలిడే కార్డ్’ని కొనుగోలు చేశాడు. ఇది హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్‌లో కూడా నిర్దిష్ట రోజులలో అన్‌లిమిటెడ్ రైడ్ సదుపాయం కల్పిస్తుంది.
శశాంక్ ఈ విధంగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకునే ప్రయత్నించడం వెనుక 2 కారణాలు ఉన్నాయట. పట్టణ ప్రజా రవాణాను ప్రోత్సహించడం, భారతదేశంలో ప్రపంచ స్థాయి మెట్రో సదుపాయాలను తెలియజెప్పాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. సిటీలలో నివసించే వారు తమ సొంత వాహనాలకు బదులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కి మారేలా చేయడమే తన ఈ ప్రయత్నమని, తద్వారా వాతావరణ కాలుష్యం కొంతమేర అయినా తగ్గుతుందని, భూమికి తిరిగి ఇవ్వడానికి ఇదొక అద్భుతమైన మార్గం అని తెలిపాడు. నిజంగానే.. శశాంక్ ఆలోచన అద్భుతం.