Arekapudi Gandhi Vs Kaushik Reddy: నువ్వు రాకపోతే నేనే వస్తా.. తేల్చుకుందాం రా..! కౌశిక్‌రెడ్డికి అరికెపూడి గాంధీ సవాల్..
‘నీ ఇంటికొస్తా.. నట్టింటికొస్తా.. నీ ఇంటిపైనే బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా’.. ఇది కౌశిక్‌రెడ్డి సవాల్..! ‘దమ్ముంటే నా ఇంటికి రా.. నువ్వో నేనో తేల్చుకుందాం’.. ఇది అరికపూడి గాంధీ ప్రతిసవాల్..! ఫిరాయింపుల ఎపిసోడ్‌లో నిన్న చీరా-గాజులు చూపిస్తూ కౌశిక్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్గి రాజేసింది.. ఇప్పుడు అది మరింతగా భగ్గుమంది..!
‘నీ ఇంటికొస్తా.. నట్టింటికొస్తా.. నీ ఇంటిపైనే బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా’.. ఇది కౌశిక్‌రెడ్డి సవాల్..! ‘దమ్ముంటే నా ఇంటికి రా.. నువ్వో నేనో తేల్చుకుందాం’.. ఇది అరికపూడి గాంధీ ప్రతిసవాల్..! ఫిరాయింపుల ఎపిసోడ్‌లో నిన్న చీరా-గాజులు చూపిస్తూ కౌశిక్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్గి రాజేసింది.. ఇప్పుడు అది మరింతగా భగ్గుమంది..! అరికపూడి గాంధీ అయితే.. కౌశిక్ తీరును, మాటల్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.. కౌశిక్‌రెడ్డి సవాల్‌కు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అరికెపూడి గాంధీ.. దమ్ముంటే రా.. నువ్వోనేనో తేల్చుకుందాం అంటూ కౌశిక్‌రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. తానేమీ చేతులు కట్టుకుని కూర్చోలేదు.. దేనికైనా సిద్ధం అంటూ ఒక రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు అరికెపూడి గాంధీ.. తాను సీనియర్ శాసన సభ్యుడినని.. నాపై మాట్లాడే అర్హత కౌశిక్‌రెడ్డికి లేదన్నారు.. కేసీఆర్‌కు తనకు ఎలాంటి విభేదాలు లేవని.. తాను ఎప్పుడూ గౌరవం ఇస్తానంటూ పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డి లాంటి బ్రోకర్ల వల్ల.. చాలామంది పార్టీకి దూరమయ్యారంటూ అరికెపూడి గాంధీ పైర్ అయ్యారు. 11గంటలకు నా ఇంటికి రా.. లేకపోతే 12గంటలకు నీ ఇంటికొస్తానంటూ కౌశిక్‌రెడ్డికి అరికెపూడి సవాల్ చేశారు. పోలీస్ సెక్యూరిటీ అవసరమే లేదు.. నీ దమ్మేంటో నా దమ్మేంటో తేల్చుకుందాం అంటూ గాంధీ పేర్కొన్నారు. కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను భ్రష్టు పట్టిస్తున్నది కౌశిక్‌రెడ్డే.. అని.. దేనికైనా తాను సిద్ధం.. అంటూ పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డికి తనకు మధ్య జరిగే యుద్ధం ఇది అంటూ పేర్కొన్నారు.
అనంతరం మాట్లాడిన కౌషిక్ రెడ్డి.. అరికెపూడి చేసేదే బ్రోకరిజం అంటూ మండిపడ్డారు. ఆయన అందర్నీ అనడం కాదు.. ఆయన చరిత్ర ఏంటో చూసుకోవాలన్నారు. అయితే.. చీర, గాజుల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారని.. KCRను చీర కట్టుకుని బస్సు ఎక్కాలని సీఎం అన్నారు.. రేవంత్ మాట్లాడినందుకే మేం మాట్లాడుతున్నామని కౌషిక్ రెడ్డి తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని.. BRS ఎమ్మెల్యేనా, కాదా అనేది గాంధీ స్పష్టత ఇవ్వాలన్నారు. కేసీఆర్‌తో గాంధీకి ఇబ్బంది లేకపోతే..తామంతా స్వాగతం పలుకుతామన్నారు. టీవీ9 వేదికగా ఇద్దరం చర్చించుకుందామని.. గాంధీ సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలన్నారు.
వీడియో చూడండి..
అయితే.. అటు కౌశిక్‌రెడ్డి సవాల్‌తో.. ఇటు అరికెపూడి గాంధీ ప్రతి సవాల్ తో ఇద్దరి నేతల ఇంటి దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. ఇరు నేతల వ్యాఖ్యలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఇప్పటికే పోలీసులు కౌశిక్‌రెడ్డి బయటకు రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..