Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: డబ్బులిచ్చేశాడు..! ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన నిర్మాతల సంఘం

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు ఈ వర్సటైల్ యాక్టర్. రీసెంట్ గా రాయన్ సినిమాతో హిట్ అందుకున్నాడు ధనుష్. ఇదిలా ఉంటే ధనుష్ కొన్ని సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకొని ఆతర్వాత ఆ సినిమాలకు డేట్స్ ఇవ్వకపోవడంతో తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆయన పై నిషేధం విధించింది.

Dhanush: డబ్బులిచ్చేశాడు..! ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన నిర్మాతల సంఘం
Danush
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Sep 12, 2024 | 4:10 PM

తమిళ్ స్టార్ హీరో ధనుష్ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ ,బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు ఈ వర్సటైల్ యాక్టర్. రీసెంట్ గా రాయన్ సినిమాతో హిట్ అందుకున్నాడు ధనుష్. ఇదిలా ఉంటే ధనుష్ కొన్ని సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకొని ఆతర్వాత ఆ సినిమాలకు డేట్స్ ఇవ్వకపోవడంతో తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆయన పై నిషేధం విధించింది. ధనుష్‌పై విధించిన నిషేధాన్ని ఆర్టిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. ధనుష్ పై నిషేధం విధించడంతో కోలీవుడ్ లో దుమారం రేగింది. చాలా మంది దీన్ని వెతిరేకించారు.

ఇది కూడా చదవండి : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?

ఈ నేపథ్యంలో తమిళ సినీ కళాకారుల సంఘం జోక్యం చేసుకుని నిర్మాతల సంఘంతో చర్చలు జరపడంతో వివాదం సద్దుమణిగింది. ధనుష్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టిఎఫ్‌పిసి) గతంలో ధనుష్‌పై కొన్ని ఆరోపణలు చేసింది. ధనుష్‌పై ప్రవర్తన సరిగ్గా లేదని ఆరోపిస్తూ నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్నా కూడా డేట్స్ ఇవ్వకపోగా సినిమాలో నటించేందుకు నిరాకరించడంతో.. నిర్మాతల సంఘం అతనితో కలిసి పని చేయకుండా నిషేధం విధించింది. అయితే ఇప్పుడు ధనుష్ పై విధించిన నిషేధాన్ని నిర్మాతల సంఘం ఉపసంహరించుకుంది.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

గతంలో ధనుష్‌పై తేనాండాళ్ ఫిల్మ్స్, 5 స్టార్ క్రియేషన్స్ నిర్మాతలు తమిళ్ ఇండస్ట్రీ నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాని విచారణ తర్వాతే ధనుష్‌పై నిషేధం విధించారు. ఇప్పుడు చర్చల ద్వారా సమస్య పరిష్కారమైంది. ధనుష్ తేనాండాళ్ ఫిల్మ్స్‌తో కొత్త సినిమా చేయడానికి అంగీకరించాడు అలాగే అతను 5 స్టార్ క్రియేషన్స్ నుంచి తీసుకున్న  డబ్బును తిరిగి ఇచ్చాడు. దాంతో ధనుష్ పై విధించిన నిషేధాన్ని నిర్మాతల సంఘం ఉపసంహరించుకుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: విష్ణు ప్రియా బట్టలు మార్చుకుంటుంటే అతను వెళ్ళాడు.. అసలు విషయం బయట పెట్టిన సోనియా

ధనుష్ ఇటీవల నటించిన ‘రాయన్ ‘ సినిమా సూపర్ హిట్ అయింది. సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న, నాగార్జున కూడా నటిస్తున్నారు. హిందీలో ‘రంఝానా’ దర్శకుడితో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో ఇళయరాజా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఇళయరాజా’ సినిమాలో నటిస్తున్నాడు. ‘అయరత్తిల్ ఒరువన్ 2’ సినిమాలో కూడా నటించనున్నాడు ధనుష్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.