Maoists: ఊరందరూ చూస్తుండగా.. ఇద్దరు గ్రామస్థులను చెట్టుకు ఉరితీసిన మావోయిస్టులు! ఎక్కడంటే
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఇద్దరు గ్రామస్థులను నక్సలైట్లు ఉరి తీశారు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా భావించిన ఇద్దరు వ్యక్తులను నక్సలైట్లు రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా చెట్లకు ఉరితీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోజప్పెమర్క గ్రామానికి చెందిన ఓ విద్యార్ధితోపాటు మడ్వి సుజ, పోడియం కోసలను మంగళవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి..
బీజాపూర్, సెప్టెంబర్ 13: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఇద్దరు గ్రామస్థులను నక్సలైట్లు ఉరి తీశారు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా భావించిన ఇద్దరు వ్యక్తులను ఊరంతా చూస్తుండగా నక్సలైట్లు ఓ చెట్టుకు ఉరితీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోజప్పెమర్క గ్రామానికి చెందిన ఓ విద్యార్ధితోపాటు మడ్వి సుజ, పోడియం కోసలను మంగళవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి తీసుకెళ్లారు. ప్రజాకోర్టు నిర్వహించిన అనంతరం మడ్వి, పోడియంలను చెట్టుకు ఉరి వేసి హత్య చేశారు. అనంతరం వారి చొక్కాలకు ఓ కరపత్రాన్ని అతికించారు. ఈ హత్యలకు తమదే బాధ్యత అని భైరంగఢ్ ఏరియా మావోయిస్టు కమిటీ ప్రకటించింది. అంతేకాదు నక్సల్స్ విడుదల చేసిన కరపత్రాల్లో బీజేపీని బహిష్కరించాలని పిలుపు నిచ్చారు. అలాగే ఇతర సందేశాలు కూడా పేర్కొన్నారు. వీరిద్దరూ పోలీసు ఇన్ఫార్మర్లని ఆరోపించింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
వీరి హత్యకు ముందు.. నక్సలైట్లు జప్పెమార్క గ్రామ సమీపంలోని అడవిలో ఒక ప్రజా కోర్టును నిర్వహించారు. అక్కడ వందలాది మంది గ్రామస్థుల ముందు విచారణ చేపట్టారు. గుమికూడిన వందలాది మంది గ్రామస్థులు చూస్తుండగా.. మడ్వి సుజ, పోడియం కోసలను ఉరితీశారు. అయితే కిడ్నాప్ అయిన వారిలో ఓ విద్యార్థి కూడా ఉండటంతో.. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా ఉండొద్దంటూ హెచ్చరించి విడుదల చేశారు. అందిన సమాచారం మేరకు సెప్టెంబర్ 3న మిర్తూరులోని ఓ హాస్టల్ విద్యార్థినితో పాటు జప్పెమార్క గ్రామానికి చెందిన మాద్వి సౌజా, పొడియం కోసలను నక్సలైట్లు అపహరించారు. ముగ్గురినీ ప్రజాకోర్టులో హాజరుపరిచిన అనంతరం నక్సలైట్లు చెట్టుకు సౌజా, కోసాలను ఉరితీశారు.
బాధితుల మృతదేహాల దుస్తులకు అతికించిన కరపత్రలలో.. వారు చాలా యేళ్లుగా పోలీసులకు గూఢచర్యం చేశారని ఆరోపించారు. ఇదే వారి మరణశిక్షకు దారితీసిందని పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని నక్సలైట్లు గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులను బెదిరించినట్లు సమాచారం. అనంతరం మృతుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. ఇద్దరు గ్రామస్థుల ఉరికి సంబంధించిన ఫొటోలను నక్సల్స్ గురువారం విడుదల చేశారు.