Thalapathy Vijay: తమిళనాట మరో పొలిటికల్ తుఫాన్.. విజయ్ పొలిటికల్ జర్నీలో బీజేపీ పాత్ర ఏంటి
తమిళనాట సినిమా అంటే జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు.. ఒక బలమైన ఎమోషన్. అక్కడ హీరోల్ని అభిమానించడంతో ఆగరు.. ఆరాధిస్తారు.. గుళ్లు కడతారు.. పూజలు చేస్తారు. ఆవిధంగా కల్ట్ ఫ్యాన్స్‌కు కేరాఫ్ అనిపించుకుంది కోలీవుడ్. మిగతా చోట్ల హీరోలు కనిపిస్తే సెల్ఫీలో, ఆటోగ్రాఫ్‌లో తీసుకుంటారు. వాళ్లు మాత్రం బొటనవేలు కోసిస్తారు... రక్త తర్పణం చేస్తారు. టిక్కెట్లు కొని సినిమాలు చూడ్డం కాదు.. ఓట్లేసి తమ హీరోలకు ముఖ్యమంత్రులుగా ప్రమోషన్లిస్తారు. ఆవిధంగా మరో కోలీవుడ్ హీరో సీఎం కుర్చీలో కర్చీఫ్ వేసుకున్నారు. విజయ్ చివరి సినిమా అనౌన్స్‌మెంట్ ఇస్తున్న పొలిటికల్ హింట్ ఇదేనట.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఒక పవర్‌స్టార్ పొలిటికల్ లైఫ్‌ని బిగ్‌స్కేల్‌లో ఆవిష్కరించేశాయి. వంద శాతం స్ట్రయిక్ రేట్‌తో నేషనల్ బిగ్ బ్రేకింగ్ అయ్యారు పీకే. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. సౌత్ నుంచి మరో పవర్‌ఫుల్ స్టార్‌ని పొలిటికల్ ఎరేనాలో నిలబెట్టబోతున్నాయా..? మోదీ చేతుల మీదుగానే దేశానికి ఈ కటౌట్ గ్రాండ్‌గా పరిచయం కాబోతోందా..? తమిళ రాజకీయాల్ని ఒంటిచేత్తో శాసిస్తానంటున్న ఇళయ దళపతి పొలిటికల్ ఫ్యూచర్.. ఎలా ఉండబోతోంది..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాట ఇటీవలే కొత్త జెండా ఎగరేసి.. తమిళగ వెట్రి కళగం పేరుతో సరికొత్త పొలిటికల్ పార్టీ స్థాపించి.. నవయువ రాజకీయాలే లక్ష్యంగా బరిలో దిగిన హీరో విజయ్… ద్రవిడ గడ్డ మీద హాట్‌ఫేవరిట్‌గా మారారు. గత నెల 22న రిలీజైన విజయ్ జెండా పాట.. అతడి అభిమానుల గుండెల్లో రీసౌండ్ ఇస్తూనే ఉంది.
ఊరమాస్ పాలిటిక్స్‌కి అడ్డాగా.. పెద్దపెద్ద సూపర్‌స్టార్‌లకే పీచేముఢ్ చూపించిన అరవ నేల మీద విజయ్ ఎలా నిలదొక్కుకుంటాడు..? ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఎదుగుతాడు..? అనే చర్చ జరుగుతుండగానే తాజా సినిమా అనౌన్స్‌మెంట్‌తో మళ్లీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు విజయ్.
విజనరీ డైరెక్టర్ హెచ్ వినోద్ కెప్టెన్సీలో, యంగ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్‌తో.. పక్కా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోంది విజయ్ 69వ మూవీ. కెరీర్‌లో నాకిదే చివరి సినిమా అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కనుక.. కోలీవుడ్‌లో విజయ్ ఫ్యాన్స్‌కి పూనకాలు మొదలయ్యాయి. తమ హీరోను ఇకమీదట సీఎం కుర్చీలోనే చూస్తాం అనేంత ఆశలు రేకెత్తిస్తోంది ఈ మూమెంట్.
నా గుండెల్లో కొలువున్న అభిమానులారా.. మీరే కనిపించే దేవుళ్లు… నా ఫ్యాన్సే నా ప్రాణం… అనే రొటీన్ డైలాగులు అందరూ కొట్టేవే. కానీ.. విజయ్ అంటే తమిళనాట యంగ్ ఆడియన్స్ గుండెల మీద పచ్చబొట్టు. అక్కడ పిల్లలు పుడితే విజయ్ పేరు పెట్టుకుంటారు.. విజయ్ పేరు మీద గుళ్లో అర్చన చేస్తారు. కరోనా టైమ్‌లో మూతబడబోతున్న థియేటర్లను కాపాడింది విజయ్ సినిమాలే అని చెప్పుకుంటారు. విజయ్ సినిమాను చూడ్డం కాదు.. సెలబ్రేట్ చేసుకుంటాం… విజయ్ సినిమా నడిచే ఆ మూడు గంటలూ మాకొక జీవితం.. అంటారు.
ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌గా మారబోతున్న విజయ్.. 69వ మూవీ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారు. 2026 ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోగా తన ఆఖరి సినిమా పూర్తయ్యేలా కాల్‌షీట్లు సెట్ చేసుకున్నారు. అందుకే.. విజయ్ ఫ్యాన్స్‌లోనే కాదు.. తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా మోస్ట్ డిబేటబుల్ టాపిక్‌గా మారింది విజయ్ సిక్స్‌టీ నైన్త్ మూవీ.
#Thalapathy69 ⚡️⚡️⚡️5th time and once again with dearest @actorvijay sir ❤️❤️❤️Extra special with #HVinoth @Jagadishbliss @LohithNK01 @KvnProductions 🫡🫡🫡 pic.twitter.com/YPOu2LisvW
— Anirudh Ravichander (@anirudhofficial) September 14, 2024
ఇన్నాళ్లూ డీఎంకెని దీటుగా ఎదుర్కొన్న అన్నాడీఎంకే ఇప్పుడు అమ్మను దూరం చేసుకుని అనాథలా మారింది. ఫలితం.. తమిళనాట పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. మరో పెద్ద పార్టీకి చోటిచ్చేంతలా గ్యాప్ క్రియేటైందక్కడ. కొట్టుకున్నా మేమే.. తిట్టుకున్నా మేమే.. తర్వాత కౌగిలించుకున్నా మేమే.. అంటూ జాతీయ పార్టీల్ని దూరం పెట్టడం ఇక్కడి ప్రాంతీయ పార్టీల అలవాటు. తమిళ ఓటర్లు కూడా ద్రవిడ పార్టీలకే జైకొడతాయి తప్ప.. నేషనల్ పార్టీల్ని దగ్గరక్కూడా రానివ్వవు. అందుకే.. ఎంత ప్రయత్నించినా బీజేపీకి తమిళనాడులో రాజమార్గం పడలేదు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై ఎక్స్‌పరిమెంట్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్లాన్-B కోసం చూస్తోంది బీజేపీ. అందులో భాగంగానే హీరో విజయ్‌ని పరోక్షంగా ఎంకరేజ్ చేస్తూ.. అతడి పాపులారిటీతో తామూ ఎదగాలన్న లక్ష్యంతో బ్యాక్‌డోర్ పాలిటిక్స్ షురూ చేస్తోందా? అన్న టాక్ నడుస్తోంది.
బీజేపీకి అస్సలు మింగుడుపడని దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. అక్కడ విజయ్ చేతులతో డోర్లు బద్దలుకొట్టించి.. పాగా వెయ్యాలని అమిత్‌షా బెటాలియన్ ప్లానేసిందట. ఒంటరిగా మారి.. బలమైన తోడు కోసం ఎదురుచూస్తున్న అన్నాడీఎంకేతో విజయ్ పార్టీకి పొత్తు కుదర్చడం, ఆవిధంగా స్టాలిన్ వ్యతిరేక ఓటుబ్యాంకును సమీకృతం చెయ్యడం.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టడం.. ఇదీ కమలం పెద్దలేసుకున్న కొత్త స్కెచ్. సో.. ఏపీలో సూపర్ సక్సెస్సయిన కూటమి ఎక్స్‌పరిమెంట్‌నే తమిళనాడులో కూడా వర్కవుట్ చేసే ఆలోచనలో ఉంది బీజేపీ. ఇక్కడ పవన్‌కల్యాణ్.. అక్కడ విజయ్.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నమాట. మోదీ రాసుకున్న స్క్రిప్టును యాజిటీజ్ తెరకెక్కిస్తే.. విజయ్ పొలిటికల్ సినిమా సూపర్‌హిట్టు కొట్టడం ఖాయమని తేల్చేశాయి తమిళ రాజకీయ విశ్లేషణలు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.