AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: వామ్మో ఇదేం ఘోరం! స్కూల్లో ఆడుకుంటుండగా 3వ తరగతి బాలికకు గుండెపోటు.. అక్కడికక్కడే మృతి

వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుండె పోటుతో కుప్పకూలి పోతున్న ఘటనలు నిత్యం ఏదో ఒక చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా అలాంటి మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్కూల్లో పిల్లలో కలసి ఆడుకుంటున్న మూడో తరగతి విద్యార్ధి ఉన్నట్లుండి ప్లే గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే హార్ట్‌ ఎటాక్‌తో మరణించినట్లు వైద్యులు..

Heart Attack: వామ్మో ఇదేం ఘోరం! స్కూల్లో ఆడుకుంటుండగా 3వ తరగతి బాలికకు గుండెపోటు.. అక్కడికక్కడే మృతి
Class 3 Student Dies Of Heart Attack
Srilakshmi C
|

Updated on: Sep 15, 2024 | 9:29 AM

Share

లక్నో, సెప్టెంబర్‌ 15: వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుండె పోటుతో కుప్పకూలి పోతున్న ఘటనలు నిత్యం ఏదో ఒక చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా అలాంటి మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్కూల్లో పిల్లలో కలసి ఆడుకుంటున్న మూడో తరగతి విద్యార్ధి ఉన్నట్లుండి ప్లే గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే హార్ట్‌ ఎటాక్‌తో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎప్పుడో 60, 70 యేళ్లకు రావల్సిన గుండె జబ్బులు పట్టుమని పదేళ్లు కూడా నిండని పసికందుకు రావడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన లక్నోలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని మాంట్‌ఫోర్ట్ స్కూల్‌లో తొమ్మిదేళ్ల విద్యార్థి.. మాన్వి సింగ్ (9) పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఆట స్థలంలో అపస్మారక స్థితిలో పడిపోయినట్లు సమాచారం అందడంతో, స్కూల్‌ ప్రిన్సిసల్‌ విద్యార్ధిని సమీపంలోని ఫాతిమా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఆమెను చందన్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక గుండెపోటుతో మరణించినట్లు ధృవీకరించారు. బాలిక మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక మృతి చెందినట్లు సమాచారం అందడంతో శనివారం పాఠశాలకు సెలవు ప్రకటించామని స్కూల్‌ ప్రిన్సిపల్ వెల్లడించారు. ఈ ఘటనతో బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మహానగర్ SHO అఖిలేష్ మిశ్రా తెలిపారు. అయితే బాలిక గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోందని, చికిత్స పొందుతోందని తమకు తెలియజేశారన్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని బట్టి, మృతి చెంది ఉంటుందని భావిస్తున్నాం. అందువల్లనే తదుపరి విచారణ అవసరం చేపట్టలేదని SHO చెప్పారు. మోంట్‌ఫోర్ట్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బ్రదర్ జిను అబ్రహం మాట్లాడుతూ.. ‘మాన్వి సింగ్‌ తెలివైన అమ్మాయని, చదువులో ఎప్పుడూ ముందుండేదని తెలిపారు. స్పృహ తప్పి పడిపోయిన వెంటనే ఫాతిమా ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ బాలిక మృతి చెందింది. ఇది దురదృష్టకర సంఘటనని’ ఆయన అన్నారు. కాగా రెండేళ్ల లక్నో విద్యార్ధుల ఆకస్మిక మృతికి సంబంధించి ఇది రెండో ఘటన. గతేడాది సెప్టెంబరు 20న సిటీ మాంటిస్సోరి స్కూల్‌లోని అలీగంజ్ క్యాంపస్‌లో 9వ తరగతి విద్యార్థి అతిఫ్ సిద్ధిఖీ కెమిస్ట్రీ క్లాస్‌లో కుప్పకూలి మరణించాడు. విద్యార్థి అతిఫ్ సిద్ధిఖీ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.