AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2024 Hall Tickets: వారంలో టెట్ హాల్‌ టికెట్లు విడుదల.. మాక్‌ టెస్టులు ఎప్పటినుంచంటే?

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై 2024 పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే టెట్ జులై-2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈసారి కూడా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో..

AP TET 2024 Hall Tickets: వారంలో టెట్ హాల్‌ టికెట్లు విడుదల.. మాక్‌ టెస్టులు ఎప్పటినుంచంటే?
AP TET 2024 Hall Tickets
Srilakshmi C
|

Updated on: Sep 16, 2024 | 7:44 AM

Share

అమరావతి, సెప్టెంబర్‌ 16: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై 2024 పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే టెట్ జులై-2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈసారి కూడా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు సెప్టెంబర్‌ 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఇక టెట్‌ హాల్‌ టికెట్లు సెప్టెంబర్‌ 22 నుంచి వెబ్‌సైట్లో అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇక అక్టోబర్‌ 4 తర్వాత నుంచి అంటే పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ప్రాథమిక ‘కీ’లు వరుసగా వెబ్‌సైట్లో విడుదల కానున్నాయి. అక్టోబర్‌ 5 నుంచి ఆన్సర్‌ కీలపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. టెట్ పరీక్షలు ముగిసిన తర్వాత అక్టోబర్‌ 27న తుది ‘కీ’ విడుదల చేస్తారు. తుది ఫలితాలు నవంబర్‌ 2న ప్రకటిస్తారు. ఓసీ(జనరల్‌) కేటగిరీకి చెందిన అభ్యర్ధులకు 60 శాతం మార్కులు ఆపైన‌ వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఇక బీసీ అభ్యర్ధులకు 50 శాతం మార్కులకుపైన‌, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు 40 శాతం మార్కులకుపైన‌ మార్కులు వస్తే ఉత్తీర్ణత అయినట్లు అవుతుంది. కాగా టెట్‌ తర్వాత రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెట్‌ మార్కులు పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పోటాపోటీగా సన్నద్ధమవుతున్నారు.

ఈసారి టెట్‌ దరఖాస్తుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌కు పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది దరఖాస్తు చేసుకోగా.. మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు అత్యధికంగా 1,04,788 మంది అప్లై చేసుకున్నారు. ఈసారి మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య అత్యధికంగా టెట్‌ రాసేవారి సంఖ్య కూడా పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?