AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur GGH: రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెలకువలో ఉండగానే మెదడులోని కణితి తొలగింపు

కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళా రోగికి ఈ సర్జరీ జరిగింది. అయితే సర్జరీ సమయంలో రోగి తన చేతులతో ట్యాబ్‌ పట్టుకుని సినిమా చూస్తూ ఉండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని విజయవంతంగా తొలగించారు. అవేక్‌ క్రేనియాటమీ అనే క్లిష్టమైన చికిత్సను రోగి మెలకువలో ఉండగానే చేయవల్సి..

Guntur GGH: రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెలకువలో ఉండగానే మెదడులోని కణితి తొలగింపు
Guntur GGH
Srilakshmi C
|

Updated on: Sep 18, 2024 | 10:33 AM

Share

కాకినాడ, సెప్టెంబర్ 18: కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళా రోగికి ఈ సర్జరీ జరిగింది. అయితే సర్జరీ సమయంలో రోగి తన చేతులతో ట్యాబ్‌ పట్టుకుని సినిమా చూస్తూ ఉండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని విజయవంతంగా తొలగించారు. అవేక్‌ క్రేనియాటమీ అనే క్లిష్టమైన చికిత్సను రోగి మెలకువలో ఉండగానే చేయవల్సి ఉంటుంది. దీంతో జీజీహెచ్‌ వైద్య బృందం రోగి సినిమాలో నిమగ్నమై ఉండగా చికిత్స పూర్తి చేశారు. వివరాల్లోకెళ్తే..

తొండంగి మండలం ఎ కొత్తపల్లికి చెందిన ఎ అనంతలక్ష్మి (55) అనే మహిళకు గత కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి లాగుతుండటంతో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. అయితే ఆమె తలలో పెద్ద కణితి ఉందని, ఇది ఖర్చుతో కూడిన వైద్యమని, నయం కావడం కష్టమని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 11న ఆమెకు తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోయి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు పరీక్షించి మెదడులో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించి, వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెప్పాడు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఆమెకు అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు.

శస్త్ర చికిత్స సమయంలో అనంత లక్ష్మి తనకు ఇష్టమైన ‘అదుర్స్‌’ సినిమా చూస్తూ, అందులోని కామెడీకి ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఆపరేషన్‌ ముగించారు. ఆపరేషన్‌ తర్వాత ఆమె లేచి కుర్చుని, అల్పాహారం తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో మొదటిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేశామని వైద్యలు తెలిపారు. అనంత లక్ష్మిని మరో అయిదు రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామని అన్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు న్యూరోసర్జరీ శస్త్రచికిత్స సీనియర్‌ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ శస్త్ర చికిత్స సాగిందని కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి, న్యూరోసర్జరీ విభాగం వైద్య నిపుణులు తెలిపారు. ఈ శస్త్రచికిత్స చేసిన వైద్య బృందంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.డీకే గిరిరావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కార్తీక్, డాక్టర్‌ టి గౌతమ్, డాక్టర్‌ గోపి, పీజీ వైద్యులు డాక్టర్‌ అరవింద్, డాక్టర్‌ సాయితేజ, డాక్టర్‌ సాయిరాం, డాక్టర్‌ శ్రావణి, డాక్టర్‌ ఆనంద్‌, డాక్టర్‌ అబు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.