- Telugu News Photo Gallery Spiritual photos Tirumala Tirupati: TTD Additional EO felicitated the vegetable donors
Tirupati: 20 ఏళ్ల క్రితం కూరగాయల విరాళం ప్రారంభం.. వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా శ్రీవారి భక్తులకు ఉచితంగా టీటీడీ అన్న ప్రసాద సేవలు అందిస్తోంది. ఇదే సమయంలో స్వామివారి అన్నప్రసాదాలను భక్తులకు అందించే అవకాశాన్ని భక్తులకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు బియ్యం, కూరగాయలు, అన్నప్రసాద వితరణ కోసం విరాళాలు భారీగా అందుతాయి. ఈ నేపధ్యంలో తాజాగా టీటీడీ కూరగాయల విరాళ దాతలతో సమావేశం అయింది. దాతలకు ఘన సన్మానం చేసింది.
Updated on: Sep 18, 2024 | 11:55 AM

కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం నిత్య కల్యాణం పచ్చ తోరణం అన్న చందంగా ఉంటుంది. శ్రీవారిని తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించి స్వామి కటాక్షం కోసం తపిస్తుంటారు.

శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండపై అడుగు పెట్టింది మొదలు.. తిరిగి కొండ దిగేవరకూ స్వామివారి అల్పాహారం. అన్న ప్రసాదం స్వీకరించి భక్తులు తరిస్తూ ఉంటారు. భక్తుల కోసం అన్న ప్రసాద వితరణను తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా అందిస్తోంది.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా శ్రీవారి భక్తులకు ఉచితంగా టీటీడీ ఈ సేవలు అందిస్తోంది. ఇదే సమయంలో స్వామివారి అన్నప్రసాదాలను భక్తులకు అందించే అవకాశాన్ని భక్తులకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు బియ్యం, కూరగాయలు, అన్నప్రసాద వితరణ కోసం విరాళాలు భారీగా అందుతాయి. ఈ నేపధ్యంలో తాజాగా టీటీడీ కూరగాయల విరాళ దాతలతో సమావేశం అయింది. దాతలకు ఘన సన్మానం చేసింది.

తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదంలో కూరగాయలది కీలక పాత్ర. గత రెండు దశాబ్దాలుగా టీటీడీ అన్నప్రసాదం కార్యకలాపాలకు వివిధ రాష్ట్రాల నుండి పంపుతున్న కూరగాయల దాతల అపారమైన సహకారం కీలకం. 20 ఏళ్లుగా టీటీడీకి కూరగాయలు విరాళంగా అందజేస్తున్న దాతలను కొనియాడుతూ, లక్షలాది మందికి అన్నప్రసాదాన్ని మరింత రుచికరమైన రీతిలో అందించడానికి మరిన్ని రకాల కూరగాయలను పంపాలని టీటీడీ కోరుతోంది.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో కూరగాయల దాతలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కూరగాయల దాతలను భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు వీలుగా మరిన్ని కూరగాయలను పంపించమని కోరారు.

ఏడాది పొడవునా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన రీతిలో రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు. అన్నప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే భక్తులకు మరిన్ని రకాల కూరగాయలను విరివిగా అందించాలని దాతలను కోరారు. తాము స్వామి వారి సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కూరగాయలు దాతలు హామీ ఇచ్చారు.

ఈ సమవేశంలో టీటీడీ ప్రత్యేక క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్ శాస్త్రి 2004లో ప్రారంభించిన కూరగాయల విరాళం.. గత 20 ఏళ్లలో సాధించిన ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కోయింబేడు, తిరుప్పూర్, నామక్కల్, చిక్కబల్లాపూర్, విజయవాడ, పలమనేరు, హైదరాబాద్, తిరుపతికి చెందిన 24 మంది కూరగాయల దాతలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర తోపాటు అన్నప్రసాదం సిబ్బంది పాల్గొన్నారు.



















