Ganesh Chaturthi: జై గణేషా.. పోలాండ్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు..
పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలను క్రకోవ్ (Cracow), గడన్స్క్(Gdansk) నగరాల్లో7 రోజులు పాటు ఎంతో వేడుకగా మరియు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అయితే 7thసెప్టెంబర్, శనివారం రోజున విగ్రహ ప్రతిష్టాపనతో మొదలైన ఈ కార్యక్రమం, ప్రతి రోజు హారతి, దంపతుల పూజలు, గణేశుడి భజనలు తో ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించాయి.