Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీఎం రేవంత్ కీలక ప్రకటన.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల నిధులు

Young India Skill University: రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కిల్స్ యూనివర్సిటీ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డు సమావేశం జరిగింది.

Follow us
Prabhakar M

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 19, 2024 | 5:33 PM

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి శ్రీధర్ బాబు, కో-చైర్మన్ శ్రీనిరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్కిల్స్ యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటుకు కార్పొరేట్లు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా యూనివర్సిటీకి సహాయం అందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి ప్రపంచ స్థాయిలో నైపుణ్యాలు కలిగిన యువతను అందించాలన్న తన ఆలోచనను వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. తెలంగాణ యువతకు నైపుణ్యాలు అందించాలన్న ఈ మహత్తర ఆలోచనను నేరవేర్చడంలో భాగస్వామ్యం అవ్వడం గర్వంగా ఉంది అన్నారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి గొప్ప విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. ఆయన విజన్‌ను నమ్మి, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ పదవిని సంతోషంగా స్వీకరించాను అని తెలిపారు. ఈ సమావేశంలో ఈ ఏడాదిలో ప్రారంభించనున్న పలు కోర్సుల వివరాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమ ప్రతినిధులు యూనివర్సిటీ అభివృద్ధి పట్ల పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

పలు రంగాల్లో అంతర్జాతీయ పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనేలా తెలంగాణ యువకుల్లో నైపుణ్యాలను పొంపొందించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ సర్కారు ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటీలో పలు విభాగాల్లో 17 కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద 57 ఎకరాల స్థలంలో ఈ యూనివర్సిటీ నిర్మాణ పనులు చేపడుతున్నారు.