AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Cabinet: రేపే తెలంగాణ కేబినెట్ భేటీ.. తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఇవే!

సెప్టెంబర్ 19 సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటి జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

Telangana Cabinet:  రేపే తెలంగాణ కేబినెట్ భేటీ.. తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఇవే!
Telangana Cabinet Meet
Prabhakar M
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 19, 2024 | 5:22 PM

Share

సెప్టెంబర్ 19 సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటి జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా పంట నష్టం సాయం, కొత్త ఆర్వోఆర్ చట్టానికి ఆమోదం, కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలియజేయనున్నట్లు సమాచారం.

మంత్రివర్గ సమావేశంలో ఇటీవల భారీ వర్షాలు, వరదలకు సంబంధించి ప్రధాన చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా పంట నష్టం కారణంగా ఖమ్మం, సూర్యాపేట, మహాబూబాబాద్ జిల్లాల్లో జరిగిన నష్టానికి ఆర్థిక సహాయం అందించడంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. భారీ వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టానికి ఈ సాయం ముఖ్యంగా దోహదపడనుంది. అదే విధంగా, కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని కేబినెట్ ఆమోదించనుంది. ప్రస్తుత ఆర్వోఆర్ చట్టాన్ని రద్దు చేసి, కొత్త చట్టం ప్రవేశపెట్టే దిశగా ఈ సమావేశం కీలకంగా ఉండనుంది.

అలాగే, విద్య, వ్యవసాయ కమిషన్లకు చట్టబద్ధత ఇవ్వనుంది. వ్యవసాయ కమిషన్ ఛైర్మన్‌గా కోదండ రెడ్డి, విద్యా కమిషన్ ఛైర్మన్‌గా ఆకునూరి మురళీ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి, కోఠిలోని ఉస్మానియా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేర్లను కేబినెట్ ఖరారు చేయనుంది. వీటితోపాటు ఆరోగ్య భీమా, రేషన్ కార్డులు, గ్రామ పంచాయతీలు ప్రభుత్వం పేదలందరికీ ఆరోగ్య బీమా అందించాలన్న ప్రతిపాదనపై కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. సీఏంఆర్ఎఫ్ నిధుల భారీ వ్యయాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. దీనిని చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి 200 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు ప్రతిపక్షాలు కేబినెట్ సమావేశంపై తీవ్ర విమర్శలు చేస్తుండగా, హామీల అమలుపై చర్చ జరగనుంది. వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో, రైతుల భరోసా పథకం అమలు కావడంపై కూడా కేబినెట్ చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రి మండలి సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలపై పూర్తి స్పష్టత రానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..