AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ZiroValley: మన దేశంలో ఈ ప్రదేశం పేరు జిరో.. ప్రకృతి అందంలో హీరో.. ఎందుకు ప్రత్యేకమంటే

జిరో వ్యాలీని సందర్శించడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు ఆసక్తిని చూపిస్తారు. అయితే జిరో వ్యాలీ టూర్ ని ప్లాన్ చేస్తుంటే ముందుగా అరుణాచల్ ప్రదేశ్ సందర్శించడానికి, అక్కడి ప్రభుత్వం నుండి ఇన్నర్ లైన్ అనుమతిని పొందవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు జిరో వ్యాలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..

ZiroValley: మన దేశంలో ఈ ప్రదేశం పేరు జిరో.. ప్రకృతి అందంలో హీరో.. ఎందుకు ప్రత్యేకమంటే
Ziro Valley Arunachal Pradesh
Surya Kala
|

Updated on: Sep 19, 2024 | 9:25 AM

Share

మన దేశంలోని ఈశాన్యభారతం చాలా అందంగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతంలో అత్యంత అందమైన రాష్ట్రం. ఇక్కడ సందర్శించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ రాష్ట్రంలో జిరో అనే పట్టణం ఉంది. ఇది అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఈ చిన్న అందమైన హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 5538 అడుగుల నుంచి 8000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ జిరో వ్యాలీని సందర్శించడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు ఆసక్తిని చూపిస్తారు. అయితే జిరో వ్యాలీ టూర్ ని ప్లాన్ చేస్తుంటే ముందుగా అరుణాచల్ ప్రదేశ్ సందర్శించడానికి, అక్కడి ప్రభుత్వం నుండి ఇన్నర్ లైన్ అనుమతిని పొందవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు జిరో వ్యాలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..

జిరో వ్యాలీ ఎందుకు ప్రత్యేకం అంటే

జిరో వ్యాలీ ప్రత్యేకమైన గిరిజన గ్రామాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న హిల్ స్టేషన్‌లో రకరకాల గిరిజన తెగలకు చెందిన వారు నివసిస్తున్నారు. ప్రాచీన అపతానీ తెగకు చెందిన గిరిజనులకు ఇది పుట్టినిల్లు. కొన్ని సంచార జాతులు కూడా ఉన్నాయి. వీరు ఎప్పటికప్పుడు తమ ఇళ్లను మారుస్తూ ఉంటారు. వీరి బట్టలు, జీవనశైలి, ఆహారం, భాష, మాండలికం, శారీరక లక్షణాలు, జీవనశైలి చాలా భిన్నంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

సందర్శించడానికి స్థలాలు

జిరో నగరం ఒక అందమైన కొండ. ఇక్కడికి చేరుకునే సమయంలోనే నగరంలోని అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. ఈ ప్రాంతంలోని అందాలను చూసి మైమరచిపోతారు. ఎవరైనా ఈ నగరాన్ని సందర్శించబోతున్నట్లయితే ఖచ్చితంగా ఈ స్థలాన్ని సందర్శించాలి.

సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం: సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఈ ఆలయం ప్రజలలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 25 అడుగుల ఎత్తు , 22 అడుగుల వెడల్పు ఉన్న శివలింగం ఉంది. దీనిని పూజించడానికి చాలా మంది వస్తుంటారు. అందుకే ఇది పర్యాటకులకు చాలా ప్రత్యేకం.

ఎందుకు జిరో వ్యాలీకి వెళ్ళాలంటే

మీరు ప్రకృతిని చాలా దగ్గరగా చూడగలుగుతారు. ఈ ప్రదేశంలో జనాభా చాలా తక్కువ.

జిరో వ్యాలీకి ఎలా చేరుకోవాలంటే

జిరో వ్యాలీ టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే.. ముందుగా తేజ్‌పూర్ విమానాశ్రయానికి విమానాన్ని బుక్ చేసుకోవచ్చు. అదే సమయంలో అస్సాంలోని ఉత్తర లఖింపూర్ విమానాశ్రయం నుండి 5 నుండి 6 గంటల పాటు ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..