AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitru Paksha 2024: పితృపక్షం కాలంలో పురుషులు ఈ పనులు చేశారా.. ఆర్ధిక నష్టాలు పక్కా!

ఈ ఏడాది పితృ పక్షం 17 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమై అక్టోబర్ 02 వరకు కొనసాగుతుంది.ఈ సమయంలో పూర్వీకులు తమ వారిని కలవటం కోసం భూమి మీదకు వస్తారని అందుకనే పితృ పక్షంలో చేసే నది స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలకు విశేష ఫలితాలు ఉంటాయని.. పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వంశం వారిని ఆశీర్వదిస్తారని విశ్వాసం. ఈ నేపధ్యంలో ఈ సమయంలో కొన్ని పనులను మగవారు పొరపాటున కూడా చేయకూడదని అంటున్నారు. ఆ పనులు తెలిసి తెలియక చేసినా సరే పూర్వీకుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ రోజు పితృ పక్షం సమయంలో మగవారు చెయ్యకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..

Pitru Paksha 2024: పితృపక్షం కాలంలో పురుషులు ఈ పనులు చేశారా.. ఆర్ధిక నష్టాలు పక్కా!
Pitru Paksha 2024
Surya Kala
|

Updated on: Sep 19, 2024 | 7:49 AM

Share

హిందూ ధర్మంలో ఏడాదిలో ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వీకులకు అంకితం చేశారు. ఈ కాలాన్ని పితృ పక్షం అని అంటారు. పక్షం అంటే 15 రోజులు.. ఈ 15 రోజుల కాలంలో తమ పూర్వీకులు భూమి మీదకు వస్తారని.. నమ్మకం. అందుకనే తమ పూర్వీకుల ఆశీస్సుల కోసం శ్రద్ధా కర్మలను నిర్వహిస్తారు. పితృ పక్షం హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద పౌర్ణమి తిది నుంచి భాద్రపద మాసం అమావాస్య తిథి వరకు ఉంటుంది. ఈ ఏడాది పితృ పక్షం 17 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమై అక్టోబర్ 02 వరకు కొనసాగుతుంది.ఈ సమయంలో పూర్వీకులు తమ వారిని కలవటం కోసం భూమి మీదకు వస్తారని అందుకనే పితృ పక్షంలో చేసే నది స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలకు విశేష ఫలితాలు ఉంటాయని.. పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వంశం వారిని ఆశీర్వదిస్తారని విశ్వాసం. ఈ నేపధ్యంలో ఈ సమయంలో కొన్ని పనులను మగవారు పొరపాటున కూడా చేయకూడదని అంటున్నారు. ఆ పనులు తెలిసి తెలియక చేసినా సరే పూర్వీకుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ రోజు పితృ పక్షం సమయంలో మగవారు చెయ్యకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..

వీటిని కొనుగోలు చేయవద్దు

ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు. అంతేకాదు పితృ పక్ష సమయంలో మగవారు కొత్త వస్తువులను, కొత్త బట్టలను కొనుగోలు చేయవద్దు అని పండితులు చెబుతున్నారు. వేటికి దూరంగా ఉండాలంటే

ఈ పితృ పక్ష సమయంలో తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్యం, మాంసం వంటి వాటిని తీసుకోరాదు.

ఇవి కూడా చదవండి

ఇలా చెయ్యటం తప్పు, ఆర్ధిక నష్టాలు

పితృ పక్షాల సమయంలో పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోకూడదు. గడ్డం చేసుకోరాదు. ఇలా చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నమ్మకం.

పూర్వీకులకు నిర్వహించే శ్రార్ధ కర్మల కోసం చేసే వంట విషయంలో పాత్రల విషయంలో కూడా ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలి. ఇనుమ పాత్రలో ఆహారాన్ని పొరపాటున చేయవద్దు. కుండ, రాగి, ఇత్తడి పాత్రలు వంటకు శ్రేష్టం.

ఏ పనులు చేయవద్దంటే

కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటివి చేయరాదు. తినే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి నిషేధం.

ఈ సమయంలో పెళ్ళిళ్ళు, నామకరణ మహోత్సవం వంటి శుభకార్యాలు చేసుకోవడం మంచిది కాదు. పితృ పక్షంలో పితృ దేవతలకు ఆగ్రహం తెప్పించే పనులను చేసే కుటుబంలో ఆర్ధిక ఇబ్బందులు, డబ్బు నష్టం తప్పదని పండితులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి