Lebanon Blast: హిజ్బుల్లా ఎంపీ అలీ అమ్మర్ కుమారుడి అంత్యక్రియల్లో పేలుడు.. వీడియో వైరల్
ఈ వీడియోలో అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఎంపీ కుమారుడికి ప్రజలు తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడ ఉన్న ప్రజలు అటు ఇటు పరుగులు తీయడం మొదలుపెట్టారు.
గత రెండు రోజులుగా పేర్లు, వాకీటాకీలు, సోలార్ పరికరాలు వంటివి పేలడంతో లెబనాన్ వణికిపోతోంది. సెప్టెంబర్ 17 మంగళవారం హిజ్బుల్లా యోధుల పేజర్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడిక్కడే 9 మంది మరణించారు. సుమారు నాలుగు వేల మంది గాయపడ్డారు. ఆ గాయం నుంచి ఇంకా తేరుకోక ముందే మళ్ళీ లెబనాన్ లో బుధవారం పలుచోట్ల వాకీటాకీలలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఒకదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేజర్ పేలుడులో మరణించిన హిజ్బుల్లా ఎంపీ అలీ అమ్మర్ కుమారుడి అంత్యక్రియల సందర్భంగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.
ఈ వీడియోలో అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఎంపీ కుమారుడికి ప్రజలు తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడ ఉన్న ప్రజలు అటు ఇటు పరుగులు తీయడం మొదలుపెట్టారు.
లెబనాన్‌లో రెండో రోజు పేలుడు
Tons of Hezbollah walkie talkies are reportedly blowing up in Lebanon today, including at a funeral for some of the militants who didn’t survive yesterday’s carnage. pic.twitter.com/8S0HCHK3GD
— Ian Miles Cheong (@stillgray) September 18, 2024
ఈ గాడ్జెట్ పేలుడు వలన అనేక భవనాలు, దుకాణాలు, వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ పేలుళ్లకు సంబంధించిన అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో లెబనాన్‌లో విధ్వంసం దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. వీధుల్లో రక్తం చిమ్ముతోంది. అంబులెన్స్‌ల శబ్దం ప్రతిచోటా వినిపిస్తోంది, కొన్ని వీడియోలలో ఒక కారు కాలిపోతున్నట్లు చూపబడింది. కొన్ని వీడియోలలో ఒక భవనంలో మంటలు ఎగసిపడుతున్నాయి.
అనేక ప్రాంతాల్లో పేలుళ్లు
లెబనాన్‌లో అనేక చోట్ల వందల కొద్దీ పేలుళ్లు జరిగాయి. మంగళవారం 4000 కంటే ఎక్కువ పేజర్ పేలుళ్ల తర్వాత.. బుధవారం వాకీ-టాకీలతో సహా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలలో పేలుళ్లు సంభవించాయి. బుధవారం జరిగిన ఈ పేలుళ్లలో ఇప్పటివరకు 20 మంది మరణించగా, 420 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
హిజ్బుల్లా ఇజ్రాయెల్‌ను దోషిగా పరిగణించింది
లెబనాన్‌లో జరిగిన ఈ పేలుళ్లను పలు దేశాలు ఖండించాయి. హిజ్బుల్లా ఈ చర్యకు ఇజ్రాయెల్‌ను నిందించింది. అంతేకాదు తాము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని.. ఇజ్రాయెల్ ఇందుకు తగిన పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుందని హిజ్బుల్లా హెచ్చరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..