PM Modi – YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్..
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు మంగళవారం.. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు మంగళవారం.. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధి వెల్లడించారు. వైఎస్ షర్మిలకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆమెను పరామర్శించారు. ఇటీవల తెలంగాణ జరిగిన ఘటనలు, ఆమెపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు.. అరెస్టు, కారులో ఉండగానే క్రేన్‌తో పోలీస్ స్టేషన్‌కు తరలించడం, పాదయాత్రలో దాడి తదితర అంశాలపై ప్రధాని మోడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. వైఎస్ షర్మిలకు ఎదురైన విషయాల గురించి ఆరాతీసిన ప్రధాని మోడీ.. వైఎస్ షర్మిలకు సానుభూతి వ్యక్తం చేశారని ఆపార్టీ నేతలు తెలిపారు. అరెస్ట్ చేసినా ఏ మాత్రం బెదరకుండా ధైర్యంగా వ్యవహరించారని స్వయంగా ప్రధాని మోడీ.. షర్మిల తీరును ప్రశంసించారని ప్రచారం జరుగుతోంది.
దాడి ఘటన, పోలీసుల తీరు, అరెస్టుపై ప్రధాని విచారం వ్యక్తం చేశారని.. ఈ సంఘటన జరిగిన తీరు తనను బాధించిందని పేర్కొన్నారని తెలుస్తోంది. ఒక మహిళను ఆ విధంగా లాక్కెళ్లడం దురదృష్టకరమని.. ఆ దృశ్యాలు తనను బాధించాయని ఆయన పేర్కొన్నట్లు చెబుతున్నారు. న్యూఢిల్లీ వచ్చినప్పుడు తనను కలవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ షర్మిలను ఆహ్వానించారని పేర్కొంటున్నారు.
ప్రధాని మోడీ ఫోన్ పై వైఎస్ షర్మిల స్పందించారు. ప్రధాని మోడీ.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. థ్యాంకూ మోడీజీ అంటూ పేర్కొన్నారు. మోడీ ఒక్కరే కాదని.. ఎంతో మంది స్పందించారని పేర్కొన్నారు. ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకోవడం, ఇలా అరెస్ట్ చేయడం అన్యాయమంటూ సానుభూతి వ్యక్తం చేశారని తెలిపారు.
మోడీ ఫోన్ కాల్ కు స్పందించిన షర్మిలమ్మ. pic.twitter.com/kFrGYLEkJF
— ????? (@YSSR2023) December 6, 2022
కాగా, షర్మిల పాదయాత్రలో ఉమ్మడి వరంగల్లోని నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు.. ఆమె కాన్వాయ్ పై దాడి చేశారు. అనంతరం ఆమె ప్రగతి భవన్‌కు వెళుతుండగా.. పోలీసులు ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..