MLC Kavitha Letter: ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన సీబీఐ.. లైవ్ వీడియో
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి రాసి లేఖపై అధికారుల నుంచి రిప్లై వచ్చింది. 11న వివరణకు అందుబాటులో ఉండాలని CBI అధికారులు కవితను కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి రాసి లేఖపై అధికారుల నుంచి రిప్లై వచ్చింది. 11న వివరణకు అందుబాటులో ఉండాలని CBI అధికారులు కవితను కోరారు. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా కవితకు సీబీఐ సమాచారం ఇచ్చింది. 11న ఉదయం 11 గంటలకు విచారణ నిర్వహిస్తామని సీబీఐ లేఖలో తెలిపింది. ఆరోజున జరిగే విచారణకు హాజరు కావాలంటూ సూచించింది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చిన ఒకరోజు తర్వాత సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 6వ తేదీన విచారణకు సిద్ధమని తెలిపిన కవిత.. ఆ తర్వాత ఫిర్యాదు ఒరిజినల్ కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీ అందించాలంటూ కవిత సీబీఐ అధికారులను కోరారు. కానీ దానికి సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. ఈ క్రమంలో కవిత జగిత్యాల పర్యటన కారణంగా విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని ఆ లేఖలో ప్రస్తావించారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

