Chandrababu: మీ ఆరోగ్య రహస్యం ఏంటి..? స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఫన్నీ ఆన్సర్.. వైరల్.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏలూరు పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ధర్మాజీగూడెంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏలూరు పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ధర్మాజీగూడెంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఫన్నీగా సమాధానం ఇచ్చారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటన్న ప్రశ్నకు.. మన మైండ్‌ను నియంత్రిస్తూ ఇష్టపడి పని చేయాలని, ఏం తినాలో? ఎంత తినాలో? జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి, సాగులో ఏది ముఖ్యమని అడగగా.. నాలెడ్జ్ ఎకానమీ అన్నింటి కంటే ముఖ్యమైనదని స్పష్టం చేశారు. వ్యవసాయం లేకుంటే ఆహారం, పరిశ్రమలు లేకుంటే వస్తువులూ ఉండవన్న చంద్రబాబు.. రెండు రంగాలను నాలెడ్జ్ ఎకానమీతో అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి చేయాల్సిన వారు విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు తరాల పరిస్థితిపై విద్యార్థులు ఆలోచించాలని కోరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Actress Seetha: ఐదు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో మెస్మరైజ్ చేస్తున్న అలనాటి నటి సీత..
Marriage request: అయ్యో.. ఒంటరిగా ఉండలేకపోతున్న.. పెళ్లి చేయమని వేడుకున్న బ్రహ్మచారి.!
Elephant attack: ఏనుగుకి కోపం వస్తే.. గిట్లుంటది! షాకింగ్ వీడియో.. పాపం అవి మాత్రం ఎం చేస్తాయ్..