Revanth Reddy: రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటిని చేస్తాం..
Warangal Declaration: తెలంగాణ అంటే తమకు ఆత్మగౌరవమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదన్నారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు..

తెలంగాణ అంటే తమకు ఆత్మగౌరవమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదన్నారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రేవంత్… రైతుల కుటుంబాలను కేసీఆర్ ఛిన్నాభిన్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. భూమిలేని కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.12వేలు సాయం చేస్తామన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకుంటామని ప్రకటించారు.
ఇందిరమ్మ రైతు భరోసా పథకం అమలుచేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. పంటల బీమా అమలుచేసి నష్టపరిహారం వెంటనే అందిస్తామన్నారు. రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పోడు రైతులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటిని పూర్తి చేస్తామన్నారు. చట్టపరంగా రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు.
వరికి ప్రస్తుతం మద్దతు ధర రూ.1960 ఉంది. క్వింటాల్ వడ్లను రూ.2500కు చొప్పున కొంటామన్నారు. పసుపు పంటను క్వింటాల్‌కు రూ.12 వేలకు కొంటామని వెల్లడించారు. మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు రూ.3500 చెల్లిస్తామని అన్నారు. కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమ రాజ్యం సాధ్యం. వరంగల్ డిక్లరేషన్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. రైతును రాజును చేయటమే మా లక్ష్యమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ వార్తల కోసం
ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సరూర్ నగర్ హత్యపై డిటేల్డ్ రిపోర్టు తెప్పించండి.. అధికారులను ఆదేశించిన గవర్నర్ తమిళిసై..
AP Politics: సీఎం జగన్ మాటే మా బాట.. ఊహాగానాలకు చెక్ పెట్టిన వైసీపీ ట్రబుల్ షూటర్లు..



