AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi Speech Highlights: సొంత పార్టీ నేతలకు డైరెక్ట్ వార్నింగ్.. టీఆర్ఎస్‌తో యుద్దమేనన్న రాహుల్ గాంధీ

Rahul Gandhi Telangana Tour: వరంగల్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు...

Rahul Gandhi Speech Highlights: సొంత పార్టీ నేతలకు డైరెక్ట్ వార్నింగ్.. టీఆర్ఎస్‌తో యుద్దమేనన్న రాహుల్ గాంధీ
Rahul Gandhi
Ravi Kiran
|

Updated on: May 06, 2022 | 8:37 PM

Share

Rahul Gandhi Telangana Tour: వరంగల్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హనుమకొండలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్‌కు చేరుకున్న ఆయనకు.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చారు. మరికాసేపట్లో రాహుల్ గాంధీ ఈ సభలో ప్రసంగించనున్నారు. అలాగే ఈ సభలో రాహుల్ గాంధీ ప్రకటించనున్న రైతు డిక్లరేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 May 2022 08:14 PM (IST)

    రాహుల్ గాంధీ కామెంట్స్..

    కాంగ్రెస్ ఎప్పటికీ బీజేపీతో కలవదని ఆ పార్టీకి తెలుసన్నారు రాహుల్ గాంధీ. లేన్ద్రం కేసీఆర్ పైన కేసులు పెట్టదు, ఈడీని పంపించదని చెప్పారు. రైతులకు మేం అండగా ఉంటాం. ఆదివాసీల 10 శాతం రిజర్వేషన్ల కోసం మా మద్దతు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. అందరికీ మేలు చేస్తాం అని రాహుల్ గాంధీ అన్నారు.

  • 06 May 2022 08:08 PM (IST)

    రాహుల్ గాంధీ కామెంట్స్..

    ప్రజల పక్షాన ఉన్న నేతలకు మాత్రమే టికెట్లు అని రాహుల్ గాంధీ అన్నారు. రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరాటమేనని చెప్పారు. రైతుల పక్షాన పోరాడేవాళ్లకు టికెట్లు ఇస్తామని.. టీఆర్ఎస్, బీజేపీలతో లాలూచీ పడే నేతలు మాకొద్దని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎలాంటి అవసరమున్నా తెలంగాణ కోసం సిద్దమన్నారు. ఇది మీ ఒక్కరి పోరాటం కాదని.. మనందరి పోరాటం అని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ తెచ్చిన నల్ల చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. తెలంగాణలో బీజేపీ గెలవలేమని తెలుసు అందుకనే టీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపే ఆలోచన చేస్తోంది.

  • 06 May 2022 08:00 PM (IST)

    కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్

    కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్, బీజేపీలతో లాలూచీపడే నేతలు తమకు వద్దని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్, కేసీఆర్తో ఒప్పందం గురించి మాట్లాడితే సహించేది లేదు. ఎంత పెద్ద నాయకులైనా పార్టీ నుంచి బహిష్కరిస్తాం. టీఆర్ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం. ఇది కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష యుద్ధం. తెలంగాణకు నష్టం చేసిన, ద్రోహం చేసిన వ్యక్తిని సహించేది లేదని రాహుల్ గాంధీ అన్నారు.

  • 06 May 2022 08:00 PM (IST)

    రాహుల్ గాంధీ కామెంట్స్..

    తెలంగాణ రైతులకు మెరుగైన జీవితాలను అందిస్తాం. తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదు.

  • 06 May 2022 07:52 PM (IST)

    రాహుల్ గాంధీ కామెంట్స్..

    తెలంగాణ ప్రభుత్వం రైతుల మాట వినదు. కేవలం కార్పోరేటర్ల కోసం పని చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందవద్దు.. అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. మేము చెబుతున్నది ఉత్తుత్తి మాటలు కావని.. రైతుల కోసం కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ కల నెరవేర్చడంలో రైతు రుణమాఫీ తొలి అడుగు అని రాహుల్ గాంధీ అన్నారు.

  • 06 May 2022 07:46 PM (IST)

    రాహుల్ గాంధీ కామెంట్స్..

    సీఎం ప్రజల సమస్యలు పరిష్కరిస్తారు. రాజుకు ప్రజల సమస్యలు పట్టవు. చతీస్‌ఘడ్‌లో ఎన్నికల ముందు రెండు వాగ్దానాలు చేశాం. రైతులకు రుణమాఫీ, పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చాం.

  • 06 May 2022 07:44 PM (IST)

    రాహుల్ గాంధీ కామెంట్స్..

    తెలంగాణ రాష్ట్రం సులువుగా ఏర్పడలేదు. ఎంతోమంది తల్లులు తమ కన్నీటిని ధారపోశారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. రాష్ట్రం ఇచ్చాం. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రజా, రైతు, కార్మిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించాం

  • 06 May 2022 07:38 PM (IST)

    రాహుల్ గాంధీ కామెంట్స్..

    ఏ ఒక్కరి కోసమో తెలంగాణ రాష్ట్రము ఏర్పడలేదు

    తెలంగాణ కొత్త రాష్ట్రం సులువుగా ఏర్పడలేదు

    తెలంగాణ వచ్చి 8 ఏళ్లు అయింది.

    ఒకే ఒక కుటుంబం మాత్రమే లాభపడింది

    తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగింది.

    ప్రత్యేక తెలంగాణ ఎంతోమంది త్యాగంతో ఏర్పడింది

    తెలంగాణ కన్న కల ఏమైంది

    యువకుల కలతో తెలంగాణ ఏర్పడింది.

  • 06 May 2022 07:35 PM (IST)

    రైతు డిక్లరేషన్ అంశాలు ఇలా ఉన్నాయి..

    సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం

    పసుపు పంటకు భరోసా కల్పిస్తాం

    కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు

    పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం

    క్వింటాల్ వడ్లకు రూ. 2500 మద్దతు ధర

    ఏ పంటను ఎంత కొంతమో ముందే చెబుతాం

    చెరుకు మద్దతు ధర రూ. 4500

    మెరుగైన పంటలకు బీమా కల్పిస్తాం

    రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర

    గిరిజనలకు భూమిపై హక్కులు కల్పిస్తాం

  • 06 May 2022 07:28 PM (IST)

    రైతు డిక్లరేషన్ అంశాలు ఇలా ఉన్నాయి..

    భూమి లేని రైతులకు పంట బీమా పధకాన్ని అమలు చేస్తాం.

    మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరుస్తాం

    రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర

    పోడు రైతులకు యాజమాన్య హక్కులు వర్తింపు అయ్యేలా చేస్తాం

  • 06 May 2022 07:27 PM (IST)

    రైతు డిక్లరేషన్ అంశాలు ఇలా ఉన్నాయి..

    అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ

    రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేల ఆర్ధిక సాయం

    ఇందిరమ్మ రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15 వేల ఆర్ధిక సాయం

    రైతు భరోసా కింద ఏడాదికి రూ. 10 వేలు ఆర్ధిక సాయం

  • 06 May 2022 07:22 PM (IST)

    మొదటి రైతు డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి..

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

  • 06 May 2022 07:20 PM (IST)

    జై సోనియామ్మ అంటూ ప్రసంగించిన రేవంత్ రెడ్డి..

    రాబోయేది సోనియా రాజ్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంటే నినాదం కాదు.. తెలంగాణ అంటే ఎన్నికల ముడి సరుకు కాదు.. తెలంగాణ అంటే పేగు బంధం, ఆత్మగౌరవం అని రేవంత్ రెడ్డి అన్నారు.

  • 06 May 2022 07:15 PM (IST)

    భట్టి విక్రమార్క కామెంట్స్..

    2022లో వరంగల్‌లోనే సభ నిర్వహించాం. 2023లో అధికారంలోకి రావడానికి ఇదే తొలి మెట్టు అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతు బంధు ఇచ్చి.. మిగతా పధకాలు ఆపేసింది. 8 ఏళ్లలో టీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని భట్టి విక్రమర్క్ విమర్శలు గుప్పించారు.

  • 06 May 2022 07:05 PM (IST)

    బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు..

    బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రైతులకు అన్యాయం చేశాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ నిర్లక్ష్యం వల్ల ఎరువుల ధరలు పెరిగాయని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

  • 06 May 2022 06:56 PM (IST)

    అన్నదాతల కుటుంబాలకు రాహుల్ పరామర్శ

    ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను రైతు సంఘర్షణ సభాస్థలి వద్ద రాహుల్ గాంధీ పరామర్శించారు. రాహుల్‌ను చూసిన రైతు కుటుంబీకులు బోరున విలపించారు. వారి దీనస్థితిని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీకి వివరించారు.

  • 06 May 2022 06:54 PM (IST)

    వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ కీలక అప్‌డేట్స్

    హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఆయన మరికాసేపట్లో రైతు డిక్లరేషన్‌పై కీలక ప్రసంగం చేయనున్నారు.

Published On - May 06,2022 6:52 PM