AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palamuru Rangareddy Project: పాలమూరు ప్రాజెక్ట్ యుద్ధం.. అవినీతి అంశంగా మారుతోందా?

తెలంగాణ రాజకీయాల్లో ఊహించనిదేదో జరగబోతోంది. అదేంటన్నది సీఎం రేవంత్ రెడ్డి చిన్న హింట్ ఇచ్చినా.. మరీ అంత దాకా వెళ్తుందా అనే అనుమానం అయితే ఉంది. 'కేసీఆర్, హరీష్‌రావు చేసిన పాపానికి ఉరి తీసినా తప్పులేదు' అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్‌పై నానా యాగీ జరుగుతోంది. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడానికీ.. ఒకరకంగా ఈ కామెంట్ కూడా కారణమైంది. బట్.. అసలు విషయం 'ఉరి' అనే టాపిక్ కాదు. 'ఉరి తీసినా తప్పులేదు'.. అని అన్న తరువాత కొనసాగింపుగా ఇంకో మాట అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 'మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవాళ్లు.. భారత్ ప్రజాస్వామ్య దేశం కాబట్టి చట్ట ప్రకారం ముందుకెళ్తున్నాం' అన్నారు. ఈ 'చట్ట ప్రకారం ముందుకెళ్తున్నాం' అనే ఆ ఒక్క సెన్‌టెన్స్.. తెలంగాణ రాజకీయాల్లో ఊహించనిదేదో జరగబోతోంది అనే అనుమానాలకు కారణమైంది. అసలేంటీ ఆ మాటకు అర్థం? సింపుల్.. ఆల్రడీ కేసీఆర్‌పై కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ఎంక్వైరీ జరుగుతోంది. ఆ రెండిటిపై వేసిన కమిషన్ల ముందు కేసీఆర్ స్వయంగా హాజరై వివరణ ఇచ్చారు. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో మరోసారి కేసీఆర్ విచారణ ఎదుర్కోవచ్చు. ఆల్రడీ.. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్-TOR రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్‌గా మ్యాటర్ అయితే ఇదే. ఇంతకీ.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకని ఆ మాట అన్నారు? ఎక్కడ, ఏ తప్పు కనిపించినందుకు ఎంక్వైరీకి చేయిస్తాం అన్నారు?

Palamuru Rangareddy Project: పాలమూరు ప్రాజెక్ట్ యుద్ధం.. అవినీతి అంశంగా మారుతోందా?
Palamuru Rangareddy Project
Ram Naramaneni
|

Updated on: Jan 02, 2026 | 9:31 PM

Share

సడెన్‌గా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ఫోకస్ చేయడంతో.. కేసీఆర్ మరో సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారనే అనుకున్నారంతా. కృష్ణాలో నీళ్లు, వాటాలు.. పాలమూరు ప్రాజెక్టులో పనులు.. ఎవరెంత చేశారనే వాదనలు.. ఇవే జరుగుతూ వచ్చాయి నిన్నటి దాకా. బట్.. ఉన్నట్టుండి స్టోరీ లైన్ ఈ ట్విస్ట్ తీసుకుంటుందని ఊహించలేదెవరూ. ఎంతైనా ‘నీటి’ అంశానికి భావోగ్వేదం ఎక్కువ కదా.. ఇరుపక్షాల వాళ్లు వాదోపవాదనలు, వాగ్వివాదాలు చేసుకుంటారనుకున్నారు. కాని ఈ కథ.. ఊహించని మలుపులతో నడుస్తోందిప్పుడు. అసలు గొడవంతా ఎక్కడ జరుగుతోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 90 శాతం పూర్తి చేసి అప్పగిస్తే.. ఈ రెండేళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదు అనేది మాజీ సీఎం కేసీఆర్ చేసిన ప్రధాన ఆరోపణ. అక్కడ మొదలైంది ఈ గొడవంతా. రెండు కిలోమీటర్ల కాలువను కూడా తవ్వలేకపోయిందని మాట్లాడుతోంది బీఆర్ఎస్. బట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటోంది..! పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో వచ్చే వందేళ్లలో కూడా సరిదిద్దలేనంత తప్పు, అన్యాయం జరిగిందంటోంది. స్ట్రెయిట్ పాయింట్ ఏంటంటే.. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్-PRLI ప్రాజెక్ట్ కట్టాలంటే ముందు వాటర్ సోర్స్ ఉండాలిగా. అంటే.. ఎక్కడో ఒక దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయాలిగా. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. జూరాల నుంచి కృష్ణా నది నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు నీరు పారించాలి అనుకున్నారు. అంటే.. పాలమూరు ప్రాజెక్టుకు సోర్స్ పాయింట్ జూరాల ప్రాజెక్ట్. ముందుగా అనుకున్నది అదే. కాని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. బీఆర్ఎస్ అధికారంలోకి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
సకల ఐశ్వర్యాలు.. శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం..!
సకల ఐశ్వర్యాలు.. శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం..!
బేబీ బంప్‌పై మెహందీ డిజైన్ వేయించుకున్న ప్రముఖ నటి.. ఫొటోస్ వైరల్
బేబీ బంప్‌పై మెహందీ డిజైన్ వేయించుకున్న ప్రముఖ నటి.. ఫొటోస్ వైరల్
వంకాయ ఎండు చేపల కూర ఇలా వండి తింటే.. ముద్ద కూడా వదలరు
వంకాయ ఎండు చేపల కూర ఇలా వండి తింటే.. ముద్ద కూడా వదలరు
మళ్లీ బంగారం ధరల్లో మార్పు.. పెరిగిన రేట్లు.. తులం ఎంతంటే..?
మళ్లీ బంగారం ధరల్లో మార్పు.. పెరిగిన రేట్లు.. తులం ఎంతంటే..?
ముఖంపై మొటిమలతో విసిగిపోయారా? చిటికెలో ఇలా వదిలించుకోండి..
ముఖంపై మొటిమలతో విసిగిపోయారా? చిటికెలో ఇలా వదిలించుకోండి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట..
హీరోయిన్ అంటే కఠినమైన డైట్ ఉండాల్సిందేనా? రెజీనా మాత్రం ఇలా..
హీరోయిన్ అంటే కఠినమైన డైట్ ఉండాల్సిందేనా? రెజీనా మాత్రం ఇలా..
ఆర్థిక స్వాతంత్య్రం కోసం అపర కుబేరుడి సలహాలు.. సేవింగ్ సీక్రెట్స్
ఆర్థిక స్వాతంత్య్రం కోసం అపర కుబేరుడి సలహాలు.. సేవింగ్ సీక్రెట్స్
టెక్నాలజీ సదస్సులో శిశిర రుతువు థీమ్‌తో అద్భుత విందు..
టెక్నాలజీ సదస్సులో శిశిర రుతువు థీమ్‌తో అద్భుత విందు..
పుల్లపుల్లగా.. ఘాటుగా.. ఆంధ్ర స్పెషల్ గోంగూర అన్నం..
పుల్లపుల్లగా.. ఘాటుగా.. ఆంధ్ర స్పెషల్ గోంగూర అన్నం..