రోజూ గుప్పెడు నువ్వులు తింటే చాలు..ఆ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు!
16 June 2026
Jyothi Gadda
మన వంటింట్లో సులభంగా దొరికే పోషకాల గనుల్లో నువ్వులు ఒకటి. ఇవి కేవలం రుచి కోసమే కాదు, శరీరానికి కొండంత అండగా నిలిచే సూపర్ ఫుడ్ అని నిపుణులు చెబుతున్నారు.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరగడం వల్ల గుండె జబ్బుల ముప్పు ఎక్కువవుతుంది. నువ్వులలో లిగ్నాన్స్, ఫైటోస్టెరాల్స్ అనే మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి. పరిశోధనల ప్రకారం, రోజూ తగిన మోతాదులో నువ్వులను తినడం వల్ల గుండె ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా రక్షణ లభిస్తుంది.
మధుమేహం (Diabetes) ఉన్నవారికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.
నువ్వులలో ఉండే పినోరెక్సినాల్ అనే పదార్థం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది.
నువ్వులలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించి, అధిక రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు ధమనులలో ప్లేక్ ఏర్పడకుండా నిరోధిస్తాయి.
శరీరంలో వచ్చే అంతర్గత వాపులు అనేక వ్యాధులకు కారణమవుతాయి. నువ్వులలోని సమ్మేళనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
నువ్వులలో కాల్షియం, జింక్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను అరికడతాయి. నల్ల నువ్వులలో కాల్షియం మరింత ఎక్కువగా ఉంటుంది.