AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేందిరా సామి.. ఉత్త వాటర్ క్యాన్ రూ.75 వేలా..!

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరయ్యకుంట గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన బాలవికాస్ వాటర్ ప్లాంట్‌లో తొలి వాటర్ క్యాన్‌కు నిర్వహించిన వేలం ఆసక్తికరంగా మారింది. ప్లాంట్ నిర్వహణ కోసం మూలనిధి సమీకరించే ఉద్దేశంతో నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన ఏర్వ శ్రీను రూ.75 వేల బిడ్‌ వేసి తొలి క్యాన్‌ను సొంతం చేసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఆయన క్యాన్‌ను అందుకున్నారు.

Telangana: ఇదేందిరా సామి.. ఉత్త వాటర్ క్యాన్ రూ.75 వేలా..!
Water Can
P Shivteja
| Edited By: |

Updated on: Jun 16, 2026 | 7:49 PM

Share

సాధారణంగా ఒక వాటర్ క్యాన్ ధర రూ.20 నుంచి రూ.50 మధ్య ఉంటుంది. కానీ సిద్ధిపేట జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం ఒక వాటర్ క్యాన్ ఏకంగా రూ.75 వేల ధర పలికింది. ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం శంకరయ్యకుంట గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 200 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చొరవతో బాలవికాస్ ఆధ్వర్యంలో కొత్తగా వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా బాలవికాస్ ప్రతినిధులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో వాటర్ ప్లాంట్‌కు ఏవైనా మరమ్మతులు అవసరమైతే వాటి కోసం ఒక మూలనిధి (కార్పస్ ఫండ్) ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొదటి వాటర్ క్యాన్‌కు వేలం నిర్వహించారు.

ఈ వేలంలో గ్రామానికి చెందిన ఏర్వ నరసింగరావు, ఏర్వ శ్రీను పోటీపడ్డారు. చివరకు ఏర్వ శ్రీను అత్యధికంగా రూ.75 వేల బిడ్‌ వేసి మొదటి వాటర్ క్యాన్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో గ్రామస్థులు, కార్యక్రమానికి హాజరైనవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలవికాస్ ప్రతినిధులు మాట్లాడుతూ, వాటర్ ప్లాంట్ అభివృద్ధికి అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఏర్వ శ్రీను పేరు ప్లాంట్‌పై ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శ్రీనుకు తొలి వాటర్ క్యాన్‌ను అందజేశారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. రూ.75 వేల విలువ పలికిన ఈ వాటర్ క్యాన్ ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

వీడియో దిగువన చూడండి …

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!