Telangana: పొలిటికల్ వార్.. ఆ నియోజకవర్గంపై మనసు పారేసుకున్న అన్ని పార్టీల నేతలు..
ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కుతకుతలాడుతుంటాయి. ఇప్పుడు పాలేరు నియోజక వర్గం హాట్ సీట్ గా మారింది.. పాలేరు అడ్డాలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది.. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.. మరోవైపు.. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు.. ఇంకోవైపు దివంగత సీఎం వైఎస్ కూతురు వైఎస్ షర్మిల.. పాలేరు టిక్కెట్ నాదే..

ఖమ్మం, ఆగస్టు 17: ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కుతకుతలాడుతుంటాయి. ఇప్పుడు పాలేరు నియోజక వర్గం హాట్ సీట్ గా మారింది.. పాలేరు అడ్డాలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది.. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.. మరోవైపు.. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు.. ఇంకోవైపు దివంగత సీఎం వైఎస్ కూతురు వైఎస్ షర్మిల.. పాలేరు టిక్కెట్ నాదే.. ఎవరెన్ని చెప్పినా.. సీటు నాదే.. గెలుపు నాదే అని కందాల, తుమ్మల.. కాదు కాదు.. పాలేరు నాది.. నాన్న సాక్షిగా నాదే అంటూ షర్మిల.. ఇంతకీ ఈ త్రిముఖ పోటీలో గెలిచేదెవ్వరనేది హాట్ టాపిక్ గా మారింది.
తుమ్మల, షర్మిల గురించి కామెంట్లు..
కందాల ఉపేందర్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పాలేరు సీటు తనదే, గెలుపు తనదే అంటున్నారు. వచ్చే మూడు నెలలు గెలుపు కోసం కష్టపడాలని అనుచరులతో చెబుతూనే..ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. మాజీ మంత్రి తుమ్మల, వైఎస్‌ఆర్ టీపీ నాయకురాలు షర్మిలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన ప్రాంతాన్ని మనం బాగుచేసుకోలేమా…ఇతర ప్రాంతాల నాయకులు రావాలా అంటూ లోకల్ సెంటిమెంట్ ప్రయోగించారు. మట్టికైనా మనోళ్లే కావాలంటారు. అలాంటిది మనకు పరాయి నాయకులు వచ్చి ఏం చేస్తారు? వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
జనం రుణం తీసుకోవడమే లక్ష్యం
తుమ్మల నాగేశ్వరరావు.. పాలేరు అంటే తుమ్మలకు ఎంత ఇష్టమో..మాటల్లో చెప్పలేం.. ఇటీవల పాలేరు నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుమ్మల బరిలో ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నారు. కేసీఆర్ తనకు అవకాశం ఇవ్వడంతోనే అభివృద్ధి చేశానని, గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి పోటీలో ఉంటానని అనుచరులతో స్పష్టం చేస్తున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధితో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పాలేరు నిలిచిందని, గోదావరి జలాలు పాలేరుకు తేవాలన్నదే తన చిరకాల కోరిక అని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేందుకే తాను పాలేరులో పోటీలో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో తుమ్మలకు సొంత ఇల్లు ఉన్నా… నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే కారణంగా ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలో ఇల్లు ఏర్పాటు చేసుకొని స్థానికంగా ఉంటున్నారు. రాజకీయాల్లో యాక్టివ మోడ్‌లో కొచ్చారు. కొడుకుతో సహా పలు కార్యక్రమాలు చేస్తున్నారు.




పాలేరులోనే పాదయాత్ర ముగిస్తానంటున్న షర్మిల..
కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న షర్మిల..పాలేరు నుంచే పోటీ చేస్తానని..త్వరలో ఇక్కడే పాదయాత్ర చేసి..ముగింపు సభ కూడా ఇక్కడే ఉంటుందని ప్రకటించారు.. షర్మిల పోటీ వైటీపీ నుంచా..కాంగ్రెస్ నుంచా.. ఒకవేళ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే..ప్రభావం ఎలా ఉంటుందనే లెక్కలు వేస్తున్నారు పాలేరు నేతలు. మొన్న వై ఎస్‌ఆర్ జయంతి రోజున పాలేరులో నాన్న విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత.. వైఎస్ సాక్షిగా చెబుతున్నా..తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని చెప్పానన్నారు.
ఇదిలాఉంటే.. కాంగ్రెస్ నేతలు, కామ్రెడ్లు కూడా ఈ సీటుకు పోటీ పడుతున్నారు. ఇలా కందాల..తుమ్మల.. షర్మిల మధ్యలో పాలేరు ఎవరి పరం కానుందో.. వెయిట్ అండ్ సీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
