AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Party: గులాబీ పార్టీలో ‘మహా’జోష్‌.. బీఆర్ఎస్‌లో విలీనమైన స్వరాజ్య మహిళా సంఘటన్‌.. కేసీఆర్ సమక్షంలో..

Maharashtra Leaders Joining In BRS: మహారాష్ట్ర రాజకీయాల్లో మహాజోష్‌తో ముందుకు వెళ్తోంది భారత్‌ రాష్ట్ర సమితి. తాజాగా, మరో పార్టీ బీఆర్‌ఎస్‌లో విలీనమైంది. మరికొందరు కీలకనేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. వనితాబాయితో పాటు పలువురు శివసేన, బీజేపీ నేతలు సైతం.. బీఆర్‌ఎస్‌లో చేరారు. తె

BRS Party: గులాబీ పార్టీలో ‘మహా’జోష్‌.. బీఆర్ఎస్‌లో విలీనమైన స్వరాజ్య మహిళా సంఘటన్‌.. కేసీఆర్ సమక్షంలో..
Maharashtra Leaders Joining In BRS
Shaik Madar Saheb
|

Updated on: Aug 17, 2023 | 8:43 AM

Share

హైదరాబాద్, ఆగస్టు 17: జాతీయ రాజకీయాలపై ఫుల్‌ ఫోకస్‌ చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావు.. మొదట మహారాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావం చూపించేందుకు సన్నద్ధమవుతున్నారు. అందుకు తగ్గట్టే భారీ సంఖ్యలో నాయకులు.. బీఆర్‌ఎస్ గూటికి చేరుకుంటున్నారు. పలు చిన్నాచితక పార్టీలు సైతం.. బీఆర్‌ఎస్‌లో విలీనమవుతుండటం విశేషం. తాజాగా మరోపార్టీ, బీఆర్‌ఎస్‌లో విలీనమైంది. మహారాష్ట్రకు చెందిన స్వరాజ్య మహిళ సంఘటన్‌.. బీఆర్‌ఎస్‌లో కలిసిపోయింది. ఆ పార్టీ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే.. తన అనుచరులు, పార్టీ సభ్యులతో బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఆమె.. బీఆర్‌ఎస్‌ పార్టీకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

వనితాబాయితో పాటు పలువురు శివసేన, బీజేపీ నేతలు సైతం.. బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణలోని మహిళా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని.. ఇలాంటి విధానాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని మహారాష్ట్ర నేతలు ఆకాంక్షించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన క్రాంతికారీ శేత్కరీ పార్టీని.. బీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సతీశ్‌ పాల్వే ప్రకటించారు.ఇటీవల కేసీఆర్‌ను కలిసి తమ మద్దతు తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర అణగారిన వర్గాల కోసం పనిచేసే లక్ష్యంతో తన పార్టీని బీఆర్‌ఎస్‌లో కలుపుతున్నట్టు ప్రకటించారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషిచేస్తామని చెప్పారు.

ఇదిలాఉంటే.. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్లాన్ రచిస్తున్న సీఎం కేసీఆర్ మొదట మహారాష్ట్రపై ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు మహారాష్ట్రలో పర్యటించారు. అంతేకాకుండా అక్కడ జరిగిన బహిరంగ సభల్లో సైతం ప్రసంగించి.. వారి సమస్యల గురించి ప్రధానంగా ప్రాస్తావించారు. ఇటీవల సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారీ చేరికలు ఉంటాయని చెప్పారు. దానికి తగినట్లుగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ చేరికలపై దృష్టిసారించింది.

ఇవి కూడా చదవండి

కాగా.. ఢిల్లీలో బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత పార్టీ కూడా పలు రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే.. మధ్య ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన నాయకులు సీఎం కేసీఆర్ ను కలిసి .. పార్టీలో చేరారు. మరికొన్ని రాష్ట్రాలకు చెందిన వారు కూడా చేరే అవకాశముందని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..