Telangana: ఒకే వ్యక్తి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. రిటైర్‌మెంట్ తీసుకుని పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే..
Warangal: ఒకే వ్యక్తి రెండు ఉద్యోగలు చేస్తూ.. అందులోనూ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ.. రెండింటిలో ప్రతి నెల జీతం తీసుకుని ఏంచక్కా రిటైర్ అయ్యాడు.
ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒకే వ్యక్తి రెండు ఉద్యోగలు చేస్తూ.. అందులోనూ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ.. రెండింటిలో ప్రతి నెల జీతం తీసుకుని ఏంచక్కా రిటైర్ అయ్యాడు. రెండు ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకేసారి పదవి విరమణ పొందాడు. పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే అప్పుడు భయట పడింది అసలు నిజం. జిల్లా ట్రెజరీ అధికారులకు ఎక్కడో అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. ఈ ఘటన ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసింది. అందులోనూ తెలంగాణలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
సుబేదారి ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ అందించిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కిషన్‌పురాకు చెందిన ఎస్‌కే సర్వర్ రెండు వేర్వేరు తేదీల్లో పుట్టినట్టుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక ఉద్యోగం.. పోలీసుశాఖలో మరో ఉద్యోగం నిర్వహించారు.
రెండు చోట్లా పదవీ విరమణ పొంది పింఛను కోసం డీటీవో కార్యాలయంలో అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే దరఖాస్తు పరిశీలిస్తున్నప్పుడు అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. అనుమానం వచ్చి రెండు పత్రాలను పరిశీలించిన డీటీవో అసలు విషయం గుర్తు పట్టాడు.
దీంతో వరంగల్ సీపీ తరుణ్‌జోషికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. రెండు చోట్లా ఒకేసారి ఉద్యోగాలు ఎలా చేశాడనేది అందిరు అధికారులకు అంతుచిక్కకుండా మారింది. ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఏకంగా జీవిత కాలం రెండు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న ఎవరికి అనుమానం రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ వ్యవహారం విచారణలో తేలుతుందని పోలీసులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం