AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం.. ఎగబడుతున్న రెండు రాష్ట్రాలు!

రెండు రాష్ట్రాల మధ్య ప్రవహించే ఓ నది కొన్ని సంవత్సరాలు స్థానికంగా నివసిస్తున్న ప్రజలకు జీవనాధారంగా నిలుస్తుంది. ఆ నది కేవలం వారికి నీటి వనరుగా మాత్రమే కాకుండా ఉపాధి కల్పించి కడుపు నింపుతుంది. అయితే వాళ్ల చేపలుపట్టి జీవనసం సాగిస్తున్నారనుకుంటే పొరపాటు.. ఎందుకంటే ఆ నదిలోంచి వాళ్లు బంగారాన్ని వెలికితీసి ఉపాధి పొందుతున్నారు. నదిలో బంగారం తీయడం ఏంటి అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.

దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం.. ఎగబడుతున్న రెండు రాష్ట్రాలు!
Boli River Gold Extraction
Anand T
|

Updated on: Feb 10, 2026 | 12:27 PM

Share

సాధారణంగా బంగారాన్ని శుద్ది చేసే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను జల్లెడ పట్టి జనాలు బంగారాన్ని వెలికి తీయడం మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఎందుకంటే బంగారం శుద్ధి చేసే క్రమంలో వాటిని నుంచి విడిపోయే రేణువులు ఆ వ్యర్థాలతో పాటు కలిసి వస్తాయి. వాటిని జనాలు శుద్ది చేసి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అలానే హరియాణా రాష్ట్రం గుండా ప్రవహించే ఈ నదిలోంచి సైతం స్థానికులు బంగారాన్ని వెలికి తీసి ఉపాధి పొందుతున్నారు. ఎందుకంటే ఆ నదిలో బంగారం లభిస్తుంది. నదిలో లభించే మట్టిలో దాగి ఉన్న బంగారు రేణువులను వెలికి తీసి స్థానిక ప్రజలు చాలా కాలంగా జీవనం సాగిస్తున్నారు.

రెండు రాష్ట్రాలను కలుపుతూ ప్రవహించే నది

బంగారంతో ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న బోలి అనే ఈ నది హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతంలో జన్మించిన హరియాణా రాష్ట్రంలోని యమునానగర్‌ జిల్లా మీదుగా ప్రవహిస్తుంది. ఈ నది మట్టిలో బంగారం రేణువులు లభించడంతో ఈ నది తీర ప్రాంత ప్రజలకు కేవలం నీటి వనరుగా మాత్రమే కాకుండా జీవనాధారంగా కూడా నిలుస్తోంది. అయితే ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే ఈ నది నుంచి బంగారాన్ని వెలికి తీసే స్థానికులు మాత్రం ఆ బంగారంపై ఎలాంటి హక్కు ఉండదు. ఎందుకంటే ఈ నదిలో ప్రవహించే బంగారం ప్రభుత్వ ఖాజానా కిందకు వస్తుంది దీంతో.. వాళ్లు కేవలం నదిలోంచి బంగారాన్ని వెలికి తీసి రోజు వారి వేతనాన్ని పొందుతారు.

ఇవి కూడా చదవండి

అయితే వర్షాకాలంలో కురిసే భారీ వర్షాల కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొండల్లో ఉన్న మట్టి కరిగి ఈ నది ప్రవాహంలో కలుస్తుంది. ఈ మట్టిలోనే బంగారం సూక్ష్మ రేణువులు కూడా కలిసి ప్రవహిస్తుంటాయి. అందుకే వర్షాకాలం వచ్చిందంటే చాలూ ఇక్కడి ప్రభుత్వం నది నుంచి బంగారాన్ని వెలికి తీసేందుకు టెండర్లను ఆహ్వానింస్తుంది. బిడ్డింగ్‌లో ఈ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు స్థానిక జనాలను రోజువారి కూలీలుగా నియమించి వారి నుంచి బంగారాన్ని వెలికి తీయిస్తారు. ఇందుకోసం వారికి కాంట్రాక్టర్లు రోజుకూ రూ.2వేల వరకు కూలీ చెల్లిస్తారు.

వర్షాకాలంలో మాత్రమే టెండర్లు

అయితే కేవలం వర్షాకాలంలో మాత్రమే ప్రభుత్వం టెండర్ల ద్వారా నదిలో ఉన్న బంగారాన్ని వెలికి తీస్తుంది. మిగతా రోజుల్లో స్థానిక ప్రజలు కూడా ఇక్కడి నది నుంచి బంగారు రేణువులను సేకరించవచ్చు. కాబట్టి నది తీర ప్రాంతాల్లో నివసించే జనాలు నది ప్రవాహం తగ్గిన తర్వాత అక్కడ ఉన్న బురదను, ఇసుకను శుద్ది చేసి బంగారాన్ని వెలికి తీస్తారు. ఇలా తీసిన బంగారాన్ని అమ్మి వాళ్లు సొమ్మ చేసుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే