AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. వారంలో 4 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు!

తెలంగాణలోని విద్యార్థులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఈ వారంలో ఏకంగా నాలుగు రోజుల పాటు స్కూల్‌లకు సెలవులు రానున్నాయి. అవును రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్, రెండో శనివారం, ఆదివారం నేపథ్యంలో ఈ సెలవులు ఉండనున్నాయి. కాబట్టి ఏ జిల్లాలో ఏ రోజుల్లో సెలవులు ఉండనున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. వారంలో 4 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు!
Telangana School Holidays
Anand T
|

Updated on: Feb 09, 2026 | 11:00 AM

Share

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేలు స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు స్కూల్‌లకు సెలవులు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సెలవులు రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కేవలం కొన్ని జిల్లాలో మాత్రమే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోజు ఎన్నికల ప్రక్రియలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్కూల్‌లకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈసీ అధికారులు. దీంతో ఈసీ అధికారులు ఫిబ్రవరి 11న ఆయా ప్రాంతాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఫిబ్రవరి 11న పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది పోలింగ్ జరిగిన ప్రాంతాల పరిధిలోని గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్‌లో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ నిర్వహించే స్కూల్‌లకు ఆరోజు అధికారులు సెలవులు ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 14న రెండో శనివారం, ఫిబ్రవరి 15న ఆదివారం ఎలాగో హాలీడే కావడంతో వరుసగా రెండ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్‌లకు సెలవులు ఉండనున్నాయి.

ఇక మొత్తం మీద ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఈ వారంలో నాలుగు రోజులు పాటు సెలవులు దొరకనుండగా.. ఇతర ప్రాంతాల్లోని విద్యార్థులకు రెండ్రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అయితే విద్యార్థులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సెలవులు కేవలం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అది కూడా జిల్లా కలెక్టర్ల నిర్ణయం మేరకు మాత్రమే ఉండనున్నాయి.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..