Telangana: గుడిలో దేవుడ్ని మొక్కేందుకు వెళ్లే భక్తులు.. వినిపించే వింత శబ్దాలు.. సీన్ కట్ చేస్తే
గుళ్లో ఏముంటుంది..? ఈ మౌలిక ప్రశ్నకు ఎవర్నుంచైనా.. దేవుడనే సమాధానమే వస్తుంది. కానీ, అక్కడ గుళ్లో మాత్రం ఏముంటుందో తెలిస్తే... మీరు అవాక్కైతారు. ఆ అంధవిశ్వాసమే... ఇప్పుడా గుడికి ఎవ్వరినీ పోకుండా చేసేసింది. మరి భక్తుడికి, భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్లో ఏం జరిగింది...? ఎందుకోసం.. గుడి లోకి భక్తులు వెళ్లడం లేదు.. ఇప్పుడు.. ఈ స్టోరీ లో తెలుసుకుందాం.

ఇక్కడ చూస్తున్న ఈ గుడి వేణుగోపాలస్వామి ఆలయం. చొప్పదండి మండలం ఆర్నకొండలో ఉన్న ఈ ఆలయ చరిత్ర 150 ఏళ్ల కిందిది. అయితే, గత 20 ఏళ్ల నుంచి ఇక్కడ సరిగ్గా ఇక్కడి దేవుడు పూజలకు నోచుకోవడం లేదు. ఓ పూజారి మరణంతో… ఈ గుళ్లో దేవుడు కాక.. అదృశ్య శక్తి ఉందని భక్తులు భావిస్తున్నారు. ఈ ఆలయం లో వేణుగోపాల స్వామి తో పాటు..పూజారి కాళిక మాత విగ్రహం ప్రతిష్ట చేశారు. కాళిక మాతకు ప్రత్యేక పూజలు చేసేవారు. అమ్మవారి ఉపవాసం ఉండే వారు హనుమంతు పంతులు.. గుళ్లో నిత్య దీపారాధన చేస్తూ.. ఇక్కడి గుళ్లోనే భూత, ప్రేత, పిశాచాలావహించినవారికి, ఇతర మానసిక రోగులకు తనకు తెలిసిన పద్ధతుల్లో చికిత్స చేస్తూ ఉండేవాడు. ఈ విషయం నలుదిశలకూ వ్యాపించి.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచీ ఇదిగో ఆర్నకొండ గుడి వద్ద ఓ పెద్ద క్యూనే కనిపించేది. వారిచ్చే కానుకలతోనే ఈ ఆలయాన్ని హనుమంతు అనే పూజారి అభివృద్ధిపర్చాడనేది స్థానికులు చెప్పే మాట. కానీ, 20 ఏళ్ల క్రితం హనుమంతు మరణంతో.. గుడి మూగబోయింది.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
అప్పటివరకూ పెద్దఎత్తున భక్తులు, మానసిక వికలాంగులతో ఎప్పుడూ కళకళలాడిన గుళ్లో… భూత, ప్రేత, పిశాచాలావహించినవారికి వైద్యమందించడంతో దెయ్యం పట్టిందనే భావన స్థానికుల్లో నెలకొనడంతో పాటు.. ఖ్యాతి వ్యాపించినట్టుగానే.. ఈ అపవాదూ నాల్గు దిక్కులకూ పాకింది. ఇప్పుడీ గుడివైపు ఇక్కడి స్థానికులు కన్నెత్తి కూడా చూడకపోగా.. పట్టపగలు సైతం ఇక్కడి నుంచి వెళ్లడానికి భయపడే పరిస్థితులకు ఇక్కడి వదంతులు కారణమయ్యాయి. అయితే.. ఈ పూజారి.. కాళికా మాత కు గంటల కొద్దీ పూజలు నిర్వహించే వారు.. ప్రతి రోజు.. అమ్మవారి కి అభిషేకం.. ఇతర పూజలు నిర్వహించే వారు.. కాళిక మాతకు పూజలు చేయడం నిల్పివేయడం తో..ఏదో జరుగుతుందనే భావన స్థానికుల్లో ఉంది.. అంతేకాదు..ఏదో శక్తి ఉందనే ప్రచారం సాగుతుంది.. గతంలో భక్తులు అడుగు పెడితే ఏదో శబ్దం వచ్చిందనే ప్రచారం ఉంది.. దీంతో..20 ఏళ్లుగా భక్తులు అడుగు పెట్టడం లేదు.. పురాతన ఆలయం.. ఇప్పుడు కూలిపోవడం సిద్ధంగా ఉంది.. ఎటు చుసిన మొక్కలు మొలిసిన దృశ్యాలు కనబడుతున్నాయి.. ఆలయ రూపు రేఖలు మారి.. వివిధ వదంతులకు కారణమవుతుంది..
ఇది చదవండి: పెళ్లి, ఆపై ఫస్ట్‌నైట్.. మూడో రోజే వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. అతడేం చేశాడంటే
ప్రస్తుతం కరీంనగర్ శివార్లలోని తీగలగుట్టపల్లికి చెందిన ఓ పూజారి రెండు, మూడు నెలలకోసారి వచ్చి దీపం పెడుతూ పోతుండగా… మిగిలిన జనం మాత్రం ఇదిగో ఆర్నకొండ ఆలయానికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం దూప, దీప నైవేద్యాలూ చూస్తున్న పూజారి ఆరోగ్యం కూడా క్షీణించడంతో.. దేవుడున్న ఈ గుడి ఇప్పుడు ఓ బూత్ బంగ్లాలా స్థానికుల్లో ఒకింత ఆందోళన రేకెత్తిస్తూ భయపెడుతోంది. రాక్షసులను చెండాడిన కాళికామాతతో పాటు… అన్ని భయాలకు దీటైన అభయాంజనేయుడు కొలువై ఉన్నా.. ఈ గుళ్లోకి వెళ్లేందుకు ఇప్పుడు జనం జంకుతున్నారు. ఒకవైపు ప్రపంచం శాస్త్ర, విజ్ఞానం వైపు అడుగులేస్తూ ఉంటే… ఇదిగో దేవుడున్న గుళ్లో ఏదో ఉందనుకుంటూ జనం రాని ఆలయాలనూ చూస్తూ ఉండటం కంప్లీట్ కాంట్రాస్ట్ పిక్చర్ ను మన ముందుంచుతోంది. మరి జనవిజ్ఞాన వేదిక సభ్యులేమైపోయారో.. గుళ్లో భయంతో భక్తజనం బందైతే… నచ్చజెప్పాల్సిన, ఖండించాల్సిన పండితులేమయ్యారో తెలియదుగానీ.. ఇప్పుడు గుళ్లో ఏది ఉందన్న పేరుతో ఆర్నకొండ ఆలయం పాడుబడిపోవడం విచారకరం. ఇలాంటి మూఢ నమ్మకాలకు చెక్ పెట్టి ఈ ఆలయ అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు..మళ్ళీ ఈ గుడి లో పూజలు నిర్వహించాలని కోరుతున్నారు.
20 ఏళ్లుగా ఇక్కడ పూజలు జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు.. భయం తో వెళ్లడం లేదని అంటున్నారు..ఏదో శక్తి కారణంగా భయం వేస్తుందని చెబుతున్నారు.. గుడి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడిలో ఏదో ఉందనే కారణంగా ఎవరు వెళ్లడం లేదని స్థానికులు అంటున్నారు. అందరూ బయపడుతున్నారని చెబుతున్నారు. భక్తులకు భరోసా కల్పించి.. గుడిని అభివృద్ధి చేయాలనీ కోరుతున్నారు.
ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..