Viral Video: వామ్మో.! ఇదేం పామురా.. జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కేసింది.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్
పాములు, పైథాన్‌లు చెట్టు ఎక్కడం మీరెప్పుడైనా చూశారా.? సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. జెట్ స్పీడ్ గా ఓ పైథాన్ చెట్టు ఎక్కడం అందులో చూడొచ్చు. ఇది ఎక్కడ జరిగిందో క్లారిటీ లేకపోగా.. ఆ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. కామెడీ వీడియోలు కావచ్చు.. థ్రిల్లింగ్ వీడియోలు కావచ్చు.. లేదా భయంకర వీడియోలు కావచ్చు.. ఇలా ఒకటేమిటి నెటిజన్లలో ఆసక్తిని పెంచేందుకు చాలానే ఉన్నాయి. ఇక జంతు ప్రపంచానికి చెందిన వీడియోలు అయితే.. చెప్పక్కర్లేదు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా చూస్తారు. మీరెప్పుడైనా ఓ పెద్ద కొండచిలువ నిటారుగా ఉన్న చెట్టును జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కెడం చూశారా.? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఓ కొండచిలువ కళ్లు మూసి తెరిచేలోపు చెట్టు ఎక్కేసింది.
ఇది చదవండి: సంతృప్తి కోసం ప్రైవేట్ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా
వైరల్ వీడియో ప్రకారం.. కొబ్బరిదింపు చేసేవాళ్లు ఎలాగైతే చెట్టు ఎక్కుతారో.. సరిగ్గా వారిని అనుసరిస్తున్నట్టుగానే ఈ కొండచిలువ కూడా అమాంతం చెట్టెక్కేసింది. ఈ పైథాన్ చెట్టు ఎక్కడానికి ఉపయోగించిన టెక్నిక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటిగా పైథాన్ తనకు తాను చెట్టుకు చుట్టుకుని.. ఆ తర్వాత పైకి పాకుతూ.. వేగంగా ఇదే టెక్నిక్ ఫాలో అయింది. కాగా, ఈ వీడియోను ఓ నెటిజన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి: ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..