Lifestyle: తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి.. నేచురల్ టిప్స్
మన రోజూవారి డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల.. ఈ మధ్యకాలంలో యువతకు గ్యాస్ సమస్య వెంటాడుతోంది. గ్యాస్ సమస్య ఒక్కసారి వస్తే.. త్వరగా ఉపశమనం దొరకదు. అది వచ్చినప్పుడల్లా ఏదో కడుపు ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. మరి దీన్ని తగ్గించాలంటే ఈ నేచురల్ టిప్స్ చూడండి.

ఉరుకుల పరుగుల జీవితంలో టైం తినడమే మర్చిపోతున్నారు జనాలు. అంతేకాదు.. పౌష్టికాహారం తినాల్సిందిపోయి.. ఏది దొరికితే దాన్ని లాగించేస్తున్నారు. దీనితో తరచూ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వచ్చిందంటే.. రోజంతా కడుపు ఏదో ఉబ్బరంగా.. అసౌకర్యంగా అనిపిస్తుంది. పనులు చేయలేం.. వర్క్ మీద ధ్యాస పెట్టలేం.. మరి మీరు కూడా తరచూ ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే.. తీసుకునే డైట్, అలవాట్లపై దృష్టి సారించాలని వైద్య నిపుణులు అంటున్నారు. మరి గ్యాస్ సమస్యను తగ్గించుకోవడానికి.. సింపుల్‌గా నేచురల్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా గ్యాస్‌ను తగ్గిస్తాయి. అటు గ్యాస్ సమస్యను ఎక్కువ చేసే బీన్స్, క్యాబేజీ, బ్రోకలీ, ఉల్లిపాయలు వంటివి కూరగాయలను ఎక్కువగా తీసుకోకండి. అలాగే రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగండి. తద్వారా జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేయడంలో తోడ్పడుతుంది. గ్యాస్ సమస్య తగ్గుతుంది.
మరోవైపు ఎక్కువ మసాలా లేదా నూనెతో చేసిన ఆహారాలను తీసుకోకండి. ఇవి జీర్ణం కావడానికి సమయం పట్టడమే కాదు.. గ్యాస్ సమస్యకు కూడా దారితీస్తుంది. అలాగే రోజులో ఒకట్రెండు సార్లు ఫుల్‌గా భోజనం చేసే బదులు.. 4-5 సార్లు కొంచెం కొంచెంగా ఆహారాన్ని తీసుకోండి. అటు రోజూ 20-30 నిమిషాల నడక లేదా యోగా లాంటివి క్రమం తప్పకుండా చేయాలి. ఇక ఒక టీస్పూన్ సోంపు లేదా జీలకర్రను నీటిలో మరిగించి తాగడం వల్ల గ్యాస్ నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. ఇవి మాత్రమే కాదు.. ఎక్కువ స్ట్రెస్ ఉన్నా గ్యాస్ సమస్య రావచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇక గ్యాస్ సమస్య ఎక్కువకాలం తీవ్రంగా ఉంటే కచ్చితంగా మీ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించండి.