తండ్రి తమలపాకు వ్యాపారి.. కొడుకు ఐపీఎల్‌లో తోపు బ్యాటర్.. 11 బంతుల్లో SRHకి హార్ట్ ఎటాక్ తెప్పించాడుగా
పాన్ అమ్మే వ్యాపారి కొడుకు.. ఐపీఎల్ లో అదరగొట్టాడు. ఓడిపోతున్న మ్యాచ్ లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసే ఈ ప్లేయర్ ను.. ఇప్పుడు ఫినిషర్ స్థానంలో బరిలోకి దిగాడు. ఆ ఆటగాడు ఎవరు.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ 2025 సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ ఓటమితో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాజస్థాన్ జట్టు ఓడిపోయినప్పటికీ, ఈ మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ ఒకడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అది మరెవరో కాదు.. శుభమ్ దూబే. రాజస్థాన్ ఓటమిలో కూడా ఈ ఆటగాడు మెరిశాడు. దూబే కేవలం 11 బంతులలోనే సిక్సర్లతో సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన పేలుడు బ్యాటింగ్‌తో హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపించాడు.
11 బంతుల్లో 34 పరుగులు..
287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులోని సగం మంది ఆటగాళ్లు 15వ ఓవర్ అయ్యేసరికి పెవిలియన్ చేరారు. అయితే ఆ తర్వాత ధృవ్ జురెల్, సంజూ శాంసన్ ఇద్దరూ కూడా జట్టుకు ఇంకా 34 బంతుల్లో 126 పరుగులు చేయాల్సి ఉండగా అవుట్ అయ్యారు. ఆపై బరిలోకి దిగిన శుభమ్ దూబే బ్యాట్ ఝుళిపించాడు. జట్టు గెలవడం కష్టం అనిపించినా.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. 11 బంతుల్లో 309 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 34 పరుగులు చేసి అభిమానులను అలరించాడు. ఈ తరుణంలో, అతడి బ్యాట్ నుంచి 1 ఫోర్, 4 సిక్సర్లు వచ్చాయి. రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలవలేకపోయినా, స్కోరు 242కి చేరుకోవడంలో.. దూబే కీలక పాత్ర పోషించాడు.
శుభమ్ దూబే ఎవరు?
శుభమ్ దూబే సాధారణంగా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. పెద్ద షాట్లు ఆడటంలో క్రేజ్ సంపాదించాడు. భారత దేశవాళీ T20 టోర్నమెంట్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కొన్ని పేలుడు ఇన్నింగ్స్‌లు ఆడటం ద్వారా వైరల్‌గా మారాడు. దీని తర్వాత గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఈ విదర్భ బ్యాట్స్‌మెన్‌ను రూ. 5.80 కోట్లుకు వేలంలో కొనుగోలు చేసింది.
ఈ సీజన్‌లో కూడా రాజస్థాన్ అతన్ని అట్టిపెట్టుకుని మెగా వేలంలో రూ.80 లక్షలు వెచ్చించింది. ఈసారి లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్ పాత్రను అప్పగించింది. దీంతో హైదరాబాద్‌పై అతడు ఓ చిన్న సినిమా చూపించాడు. శుభమ్ దూబే ఇప్పటివరకు 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతడు 38.35 సగటుతో 652 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 152గా ఉంది.