Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెళ్లి, ఆపై ఫస్ట్‌నైట్.. మూడో రోజే వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. అతడేం చేశాడంటే

ఆన్‌లైన్‌ ప్రేమ ఓ అమ్మాయి జీవితాన్ని నిండా ముంచేసింది. అయోధ్యకు చెందిన ఓ అమ్మాయి.. ఆన్‌లైన్‌లో పరిచయమైన అబ్బాయిని నమ్మి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ అయిన మూడు రోజులకు ఆ అబ్బాయి.. ఆమెను నిండా ముంచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

Viral: పెళ్లి, ఆపై ఫస్ట్‌నైట్.. మూడో రోజే వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. అతడేం చేశాడంటే
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 25, 2025 | 7:37 PM

ఆన్‌లైన్ ప్రేమను నమ్మి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది ఓ అమ్మాయి. ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాంట్ ప్రేమ కోసం వెతికే కొందరు.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో దొరికేది ప్రేమ కాదు.. కేవలం శృంగారం మాత్రమే. కొందరు హార్మోన్స్ కంట్రోల్ చేసుకోలేని బ్యాచ్.. అమ్మాయిలను ఇన్‌స్టా వేదికగా ట్రాప్ చేసి.. వారితో లైంగిక సుఖాన్ని అనుభవిస్తున్నారు. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అయోధ్యకు చెందిన జ్యోతి శుక్లా అనే అమ్మాయిను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడు ఓ కేటుగాడు(అనికేత్). ఆమెను ప్రేమ పేరుతో లోబరుచుకుని.. ఆపై పెళ్లి చేసుకుని మోసం చేశాడు. తీరా అతడి మోజు తీరాక.. వదిలేసి ఆస్ట్రేలియా చెక్కేశాడు. చివరికి అయోధ్య పోలీసులను ఆశ్రయించిన జ్యోతి.. అనికేత్‌పై ఫిర్యాదు చేసింది. తనను మానసికంగా, శారీరికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అనికేత్‌పై దాడి, వరకట్న వేధింపులు, 420 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది చదవండి: సంతృప్తి కోసం ప్రైవేట్‌ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా

అసలేం జరిగిందంటే..

అయోధ్యలో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తోన్న జ్యోతి.. 2020 కరోనా సమయంలో ఎక్కువగా లూడో ఆడుతుండేది. ఆ సమయంలో ఆమెకు సిమ్మీ అనే అమ్మాయి పరిచయమైంది. కొద్దిరోజులకు వారి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే అనూహ్యంగా కొన్ని నెలల్లోనే సిమ్మీ చనిపోయిందని జ్యోతికి మెసేజ్ వచ్చింది. ఇక సిమ్మీ ఐడీ ద్వారా పంజాబ్‌కు చెందిన అనికేత్ శర్మ అనే వ్యక్తి జ్యోతితో టచ్‌లోకి వచ్చాడు. వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా.. ఇష్టంగా మారి.. ఒకరికొకరు నెంబర్స్ ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఓ రోజు అకస్మాత్తుగా జ్యోతికి ప్రపోజ్ చేశాడు అనికేత్. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తన మనసులో మాటను బయటపెట్టాడు. దీంతో జ్యోతి కూడా అతడిపై తనకున్న ఇష్టాన్ని చెప్పింది. వీరిద్దరి వివాహం 6 మే 2023న జరిగింది. ఈ వివాహానికి జ్యోతి కుటుంబ సభ్యులు హాజరు కాగా.. అనికేత్ కుటుంబం ఎవ్వరూ రాలేదు. ఎందుకు రాలేదని జ్యోతి అడగ్గా.. తాను ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నానని.. త్వరలోనే ఆమెను ఆస్ట్రేలియాలోని తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్తానని చెప్పాడు అనికేత్.

అయోధ్యలోని పలు హోటల్స్‌లో మూడు రోజులు బస చేసిన వీరిద్దరూ.. తమ ఫస్ట్ నైట్‌ను ముగించారు. ఇక 2023 మే 9న, అనికేత్ జ్యోతితో తనకు ముఖ్యమైన ఆఫీసు పనులు ఉన్నాయని ఆస్ట్రేలియా వెళ్లాలని చెప్పి.. పరారయ్యాడు. కొద్దిరోజులు వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ సజావుగానే సాగింది. అయితే ఆ తర్వాత ఏమైందో.. ఏమో.. జ్యోతితో గొడవపడటం మొదలుపెట్టాడు అనికేత్. తనకు రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అయితే అనికేత్ అడిగినంత డబ్బు జ్యోతి ఇవ్వకపోవడంతో.. ఆమె ఫోన్లు ఎత్తడం మానేశాడు.

ఇది చదవండి: ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?

దీంతో చేసేదేమీలేక సెప్టెంబర్ 19, 2023న జ్యోతి టూరిస్ట్ వీసాతో ఆస్ట్రేలియాలోని అనికేత్ అడ్రెస్‌కు చేరింది. అక్కడ అసలు నిజం బయటపడింది. అనికేత్ అప్పటికే పెళ్లి చేసుకున్నాడని గుర్తించింది జ్యోతి. అలాగే అతడి తల్లిదండ్రులు పంజాబ్‌లోనే నివసిస్తున్నారని తెలుసుకుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు పంజాబ్‌లోని అతడి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది జ్యోతి. అయితే అక్కడ ఆమెకు చుక్కెదురు అయింది. అనికేత్ కుటుంబ సభ్యులు ఆమెను కొట్టి, దుర్భాషలాడి, అక్కడి నుంచి గెంటేశారు. చివరికి తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది జ్యోతి శుక్లా.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..