Telangana: మాతృత్వానికే అవమానం!.. అప్పుడే పుట్టిన శిశువుని ముళ్లపొదల్లో విసిరేసిన తల్లి.. ఆడపిల్ల కనుకే ఇలా చేసి ఉంటారని అనుమానం..
కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా అమ్మ ప్రేమలో కూడా మార్పులు వచ్చాయా అనిపించేలా మానవత్వం.. మాతృత్వం సిగ్గుపడేలా కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అవును మాతృ ప్రేమ మలినమవుతోంది. నవ మాసాలు మోసిన కన్నపేగును తల్లి వదిలించుకుంటుంది. తాజాగా అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ళ పొదల్లో పడేసిన అమానవనీయ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ పసికందు మాత్రం క్షేమంగానే ఉంది

సృష్టిలో అమ్మ ప్రేమను మించిన గొప్పది ఏది లేదు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరో జీవికి ప్రాణం పొసే అమ్మ.. ఆ పుట్టిన బిడ్డను పెంచుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా భయపడడదు. తన శక్తినంతా ధారపోసి మరీ తన బిడ్డను పెంచుకుంటుంది. అందుకనే అమ్మని మించి దైవం ఇలలో లేదని అంటారు. మన దేశంలో మాతృదేవో భవ అంటూ అమ్మకు మొదటి స్థానం ఇచ్చారు. అటువంటి గొప్పదనం అమ్మ ప్రేమ సొంతం. కానీ కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా అమ్మ ప్రేమలో కూడా మార్పులు వచ్చాయా అనిపించేలా మానవత్వం.. మాతృత్వం సిగ్గుపడేలా కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అవును మాతృ ప్రేమ మలినమవుతోంది. నవ మాసాలు మోసిన కన్నపేగును తల్లి వదిలించుకుంటుంది. తాజాగా అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ళ పొదల్లో పడేసిన అమానవనీయ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ పసికందు మాత్రం క్షేమంగానే ఉంది. వివరాల్లోకి వెళితే..
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేశారు. తెల్లవారు జామున ఎస్సీ కాలనీలోని చర్చి పక్కన చెట్లపొదల్లో నుంచి పసికందు అరుపులు వినిపించాయి. దీంతో స్థానికులు చెట్ల పొదల్లోకి వెళ్లి చూడగా ఆడ శిశువు కనిపించింది. ముళ్ళపోదల్లో ముళ్ళు గీరుకుపోయి పసికందు శరీరమంతా రక్తస్రావమైంది. స్థానిక మహిళలు ఆ చిన్నారి బాలికను బయటికి తీసి శుభ్రం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఐసిడిఎస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆడ శిశువును మెరుగైన వైద్య చికిత్స కోసం సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పుడే పుట్టిన పిల్లను ఎలా ముళ్లపొదల్లో పడేశారో అని అంటుకుంటూ.. ఆడపిల్ల పుట్టినందుకు తల్లిదండ్రులు ఇంత దారుణానానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




