Telangana: పైప్‌లైన్ కోసం గుంతలను తవ్వుతుండగా కనిపించిన దుప్పటి.. తెరచి చూడగా.. ?
పైప్ లైన్ కోసం గుంతలను తీస్తూ ఉండగా బండరాళ్ల మధ్యలో మొదటగా ఒక దుప్పటి ప్రత్యక్షమైంది. దీంతో అనుమానం వచ్చిన ఓనర్.. చుట్టుపక్కల మట్టిని తొలగిస్తూ ఉండగా మహిళ చేతులు కాళ్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అతడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఇక చివరికి ఆ ఫామ్ హౌస్ ఓనర్.. చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళ ఎవరు ఎవరు హత్య చేశారు అనే దానిపై దర్యాప్తును ప్రారంభించారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివార ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌లో ప్రత్యక్షమైన మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. ఫామ్ హౌస్‌లో పైప్ లైన్ వేయించేందుకు వచ్చినటువంటి ఫామ్ హౌస్ ఓనర్ మల్లారెడ్డి.. పైప్ లైన్ కోసం గుంతలను తవ్వుతుండగా బండరాళ్ల మధ్యలో మొదటగా ఒక దుప్పటి ప్రత్యక్షమైంది. దీంతో అనుమానం వచ్చిన ఓనర్.. చుట్టుపక్కల మట్టిని తొలగిస్తూ ఉండగా మహిళ చేతులు కాళ్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అతడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఇక చివరికి ఆ ఫామ్ హౌస్ ఓనర్.. చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళ ఎవరు ఎవరు హత్య చేశారు అనే దానిపై దర్యాప్తును ప్రారంభించారు. ఫామ్ హౌస్ లో మహిళను హత్య చేసి పూడ్చిపెట్టినటువంటి ఘటనలో పోలీసులు 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. చేవెళ్ల గ్రామానికి చెందినటువంటి శివలీల అలియాస్ మైసమ్మ అనే మహిళను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల తమ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే శివలీల అలియస్ మైసమ్మ తొమ్మిది సంవత్సరాల నుంచి తన భర్త నాగయ్యకు దూరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఏ నేపథ్యంలో శివలీలకు మొయినాబాద్ కల్లు కాంపౌండ్ వద్ద సత్యా, కల్పన అనే భార్యాభర్తలు పరిచయమయ్యారు. శివలీల వారిద్దరినీ తనకు ఏదైనా కూలి పని ఇప్పించమని కోరింది. అనంతరం దంపతులిద్దరూ పనిచేస్తున్నటువంటి ఫామ్ హౌస్‌కు శివ లీలలు తీసుకువెళ్లారు. అనంతరం ఫామ్‌హౌస్ ఓనర్ మల్లారెడ్డితో శివలీలను కూడా పనిలో చేర్చుకోవాల్సిందిగా సత్యా, కల్పన కోరారు. అయితే అప్పటికే తాగిన మత్తులో ఉన్నటువంటి వారిద్దరిని ఓనర్ మల్లారెడ్డి మందలించాడు. శివలీల పని గురించి తర్వాత చూద్దాము అని చెప్పినటువంటి ఓనర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. కానీ ఆ తర్వాత సత్య, కల్పనలు అక్కడే మద్యం సేవించారు.
అలా మద్యం సేవించిన మత్తులో ఈ దంపతులకు శివలీలతో గొడవ జరిగింది. అయితే ఆ దంపతులు శివలీలను కట్టెతో బలంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడిక్కడె ప్రాణాలు కోల్పోయింది. ఇక కంగారు పడిన ఆ దంపుతులు విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని.. వారు పనిచేస్తున్న ఫామ్‌హౌస్‌లోనే శివలీలను పూడ్చిపెట్టారు. ఆ తర్వాతి రోజు ఓనర్ మల్లారెడ్డి పైప్ లైన్ కోసం గుంతలు తీయాలనుకున్నాడు. ఆ పని మొదలుపెట్టిన కాసేపటికే బండరాళ్ల మధ్యలో దుప్పటి కనిపించింది. ఇక దాన్ని చూడగా ఆ మహిళ కనిపించడంతో ఆ ఫామ్‌హౌస్ ఓనర్ షాకైపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహిళను హత్య చేసి పూడ్చిపెట్టడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




