Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: విజయవంతంగా ముగిసిన G20 సమ్మిట్.. ఈ సదస్సులో ఏర్పాటు చేసిన ఈ 5 ఫొటోలతో ప్రపంచానికి తన సందేశాన్ని చెప్పిన భారత్.. చిత్రాలకు అర్ధం ఏమిటంటే..

భారతదేశం నిర్వహించిన G20 సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. దాదాపు 20 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సుని భారీ ఎత్తున నిర్వహించింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, కళలను తెలియజెప్పే విధంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో కొన్ని చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా  ఓ  ఐదు చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రాల ద్వారా ప్రభుత్వం ప్రపంచానికి ప్రత్యేక సందేశాన్ని ఇచ్చింది. వాటి స్పెషాలిటీ ఏమిటంటే. 

Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Sep 11, 2023 | 8:28 AM

భారత మండపంలోని సమావేశ మందిరం ప్రవేశం వద్ద 28 అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని స్థాపించడం వెనుక మతపరమైన కారణంతో పాటు చారిత్రక దృక్పదం కూడా  ఉంది. ఈ నటరాజ విగ్రహం శివుని నృత్య భంగిమను వర్ణిస్తుంది. ఇందులో శివుడు నటరాజ స్వామిగా రాక్షసుడిని తన ఒంటికాలితో నొక్కుతూ భూమిలోకి అదిమి పెడుతున్నాడు. అటువంటి పరిస్థితిలో శివుని నటరాజ  రూపం.. నృత్యం ద్వారా చెడును తొలగించి సానుకూల శక్తిని ప్రసారం చేస్తాడనే సందేశాన్ని ఇస్తుంది.

1 / 5
నలంద విశ్వవిద్యాలయం 5వ శతాబ్దంనుంచి 12వ శతాబ్దం మధ్య ఉండేది. ఇది మహావీరుడు..  బుద్ధుని కాలం నాటిదిగా పరిగణించబడుతుంది. ఈ విశ్వవిద్యాలయం ప్రాచీన భారతదేశ జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ప్రపంచంలోని పురాతన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలంద విశ్వవిద్యాలయం భారతదేశం అధునాతన.. విద్యా పరిశోధనలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు.

2 / 5
జీ20 సదస్సు రెండో రోజు సభ్యదేశాల అధినేతలు జాతిపిత మహాత్మాగాంధీ సమాధి అయిన రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ఇక్కడ ప్రధాని మోడీ అధినేతలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వాగత వేదిక నేపథ్యంలో సబర్మతీ ఆశ్రమం చిత్రపటాన్ని ఉంచారు. దీనికి సంబంధించి, సబర్మతి ఆశ్రమం గురించి ప్రధాని మోడీ మొదట అతిథులందరికీ తెలియజేశారు. మహాత్మా గాంధీ 1915లో దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో అతని మొదటి ఆశ్రమం 25 మే 1915న అహ్మదాబాద్‌లోని కొచ్రాబ్ ప్రాంతంలో స్థాపించబడింది. అయితే సుమారు రెండు సంవత్సరాల తర్వాత 17 జూన్ 1917న గాంధీ  ఆశ్రమం మార్చబడింది. సబర్మతి ఒడ్డును ప్రతిభింబించేలా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ప్రపంచ నాయకులకు సత్యం, అహింస సందేశాన్ని అందించారు.

3 / 5
భారత మండపం స్వాగత వేదిక నేపథ్యంలో భారీ చక్రం చిత్రం కనిపించింది. ఈ చిత్రం ఒడిశాలోని కోణార్క్ దేవాలయానికి సంబంధించిన చక్రం. ఈ చక్రం 13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ్-I పాలనలో నిర్మించబడింది. జాతీయ పతాకం, త్రివర్ణ పతాకంలో కూడా అదే 24 గీతల చక్రం ఉపయోగించబడింది. కోణార్క్ చక్రం పురోగతికి ..  సమయానికి సంబంధించిన స్థిరమైన మార్పుకు చిహ్నం. సూర్యుని శక్తితో ప్రపంచం మొత్తం ఎలా నడుస్తుంది అనేది ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశాలలో ఒకటి.

4 / 5
ప్రస్తుతం ఇండియా వర్సెస్ భారత్ అనే చర్చ నడుస్తోంది. వీటన్నింటి మధ్య, జి 20 సదస్సు మొదటి సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ టేబుల్‌పై ఉంచిన కంట్రీ ప్లేట్‌లో.. దేశం పేరు ఇండియా కాదు, భారత్ అని వ్రాయబడి ఉంది. ఇంతకు ముందు జరిగిన అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలన్నింటిలోనూ ఇండియా  పేరునే వాడారు.

5 / 5
Follow us