- Telugu News Photo Gallery World photos Morocco Earthquake: village was once a center of tourist attraction see Viral Photos
Morocco Earthquake: ఈ నగరం నాడు స్వర్గం.. నేడు శిధిలాలతో రుద్రభూమి.. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలు..
ప్రకృతికి కోపం వస్తే.. మనిషి.. మానవ నిర్మితాలు కూడా కుప్పకూలిపోవాల్సిందేనని భూకంపం, వరదలు, సునామీ వంటివి ఎప్పటికప్పుడు మానవాళిని హెచ్చరిస్తూనే ఉన్నాయి. అందమైన నగరం ఒక్క రాత్రిలోనే రుద్రా భూమిగా మారిపోయింది. దక్షిణాఫ్రికాలోని మొరాకో గ్రామం ఒకప్పుడు పర్యాటకులను ఆకర్షిస్తుండేది. గత శుక్రవారం అర్థరాత్రి భూకంప ప్రకంపనలు వచ్చే సమయం వరకూ మాత్రమే.. అట్లాస్ పర్వతాలపై ఉన్న ఈ గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో వేలాది మంది చనిపోయారు.. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి.
Updated on: Sep 11, 2023 | 9:48 AM

సుందరమైన మొరాకో, మర్రకేష్ నగరానికి సమీపంలో ఉన్న మౌలే బ్రాహిమ్ అనే పర్యాటకుల అభిమాన గ్రామం భారీ భూకంపంతో కదిలిపోయింది. ఎక్కడ చూసినా.. బాధితుల అరుపులే వినిపిస్తున్నాయి. శుక్రవారం అర్థరాత్రి భూకంపం ఆగిపోయే సమయానికి అట్లాస్ పర్వతాలపై ఉన్న ఈ గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో వేలాది మంది చనిపోయారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి.

3,000 కంటే తక్కువ జనాభా ఉన్న ఈ గ్రామం ఒకప్పుడు ఫేమస్ పర్యాటక కేంద్రంగా ఉంది, రెస్క్యూ వర్కర్లు ఇప్పుడు శిధిలమైన భవనాల శిధిలాల కింద ఊపిరి తీసుకుంటున్న బాధితులను వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గ్రామంలోని భూకంప దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి.

భూకంపం కేంద్రానికి ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఇటుక ఇళ్లలో నివసిస్తున్నారు. అవి నివాసయోగ్యంగా లేవు. గ్రామానికి చెందిన అయూబ్ తౌడితే మాట్లాడుతూ, 'భూకంపం సృష్టించిన ప్రళయం తమకు షాక్ కలిగించిందని పేర్కొన్నారు. అంతేకాదు కేవలం 10 సెకన్ల వ్యవధిలో గ్రామంలోని ప్రతిదీ నాశనం అయ్యిందని చెప్పారు.

నిమిషానికి పైగా భూకంపం సంభవించింది. భయాందోళనకు గురైన గ్రామస్తులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. భూ ప్రకంపనలు ఆగిన అనంతరం బాధితులు తమ ప్రాంతానికి తిరిగి వచ్చి.. శిధిలాల కింద చిక్కుకున్న వారిని.. మృతదేహాలను బయటకు తీయడం ప్రారంభించారు.

ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భూకంపం బీభత్సం సృష్టించింది. ఈ భూ ప్రకంపనలతో మరణించిన వారి సంఖ్య 2,000 కంటే ఎక్కువ పెరిగింది. కనీసం 2,059 మంది గాయపడ్డారు. భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బంది కష్టపడుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

గ్రామ ఆర్థిక వ్యవస్థ ఎక్కువ భాగం వ్యవసాయం, పర్యాటక రంగాలపై ఆధారపడి ఉంది. భూకంపంతో నాశనమైన గ్రామాన్ని పునర్నిర్మించడానికి.. గ్రామస్థుల జీవితం సాధారణ స్థితికి రావడానికి.. గ్రామంలో పర్యాటకులు తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు.
