Telangana Rains: ప్రాణాలకు తెగించి మరీ వరదలో చిక్కుకున్న గిరిజనలను రక్షించిన పోలీసులు..

డిండీ నది నీటిలో చిక్కుకున్న 10 మంది చెంచు గిరిజనులను రక్షించారు నల్గొండ మరియు నాగర్‌కర్నూల్ జిల్లాల పోలీసులు. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్‌తో కలిసి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులను రాష్ట్ర డిజిపి జితేందర్ అభినందించారు. డిండీ మండలంలోని గోనెబోయినపల్లి గ్రామానికి చెందిన 10 మంది చెంచు గిరిజనులను, డిండీ నది పెరుగుతున్న వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని విజయవంతంగా రక్షించారు.

Telangana Rains: ప్రాణాలకు తెగించి మరీ వరదలో చిక్కుకున్న గిరిజనలను రక్షించిన పోలీసులు..
Police Humanity
Follow us

| Edited By: Surya Kala

Updated on: Sep 03, 2024 | 7:42 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అనేక ప్రాంత ప్రజలు వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నదీ తీర ప్రాంతలోని ప్రజలు అవస్థలు వర్ణనాతీతం. బాధితుల సహాయార్ధం పోలీసులు సైతం రంగంలోకి దిగారు. తాజాగా డిండీ నది నీటిలో చిక్కుకున్న 10 మంది చెంచు గిరిజనులను రక్షించారు నల్గొండ మరియు నాగర్‌కర్నూల్ జిల్లాల పోలీసులు. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్‌తో కలిసి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులను రాష్ట్ర డిజిపి జితేందర్ అభినందించారు. డిండీ మండలంలోని గోనెబోయినపల్లి గ్రామానికి చెందిన 10 మంది చెంచు గిరిజనులను, డిండీ నది పెరుగుతున్న వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని విజయవంతంగా రక్షించారు.

డిండీ మండలంలోని గోనమోని పల్లి గ్రామానికి చెందిన గిరిజనులు భారీ వర్షాల కారణంగా నీటి మట్టం పెరగడంతో డిండీ కత్వ వద్ద చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. మత్స్యకారులు, పడవల సాయంతో.. వరదలో చిక్కుకున్న బాధితులను సురక్షితం ప్రాంతానికి తీసుకుని వచ్చారు.

ప్రాణాలకు తెగించి చేసిన రెస్క్యూ ఆపరేషన్ లో రక్షించబడిన వ్యక్తులు:

ఇవి కూడా చదవండి

1. జల్లా గురువయ్య (70 సంవత్సరాలు) 2. నిరంజమ్మ (60 సంవత్సరాలు), గురువయ్య భార్య 3. జల్లా బయ్యన్న (35 సంవత్సరాలు), గురువయ్య కుమారుడు 4. జల్లా సత్యయ్య (20 సంవత్సరాలు), గురువయ్య కుమారుడు 5. జల్లా చిన్న పాపయ్య (30 సంవత్సరాలు), గురువయ్య కుమారుడు 6. యాదమ్మ (20 సంవత్సరాలు), పాపయ్య భార్య 7. అంజలి (5 సంవత్సరాలు), పాపయ్య కుమార్తె 8. అఖిల (3 సంవత్సరాలు), చిన్న పాపయ్య కుమార్తె 9. శివ (16 సంవత్సరాలు), చిన్న పాపయ్య కుమారుడు 10. ఒక చిన్న బాబు

బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించి, అవసరమైన వైద్య సహాయం మరియు సహాయక సామగ్రి అందించారు. వర్షాకాలంలో పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ బృందాల సామూహిక కృషిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతి పౌరుడి భద్రత కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని అధికారులను ప్రశంసిస్తున్నారు. వర్షాలు, వరదల నేపధ్యంలో జిల్లా యంత్రాంగం తక్కువ మట్టం ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలనీ సూచిస్తున్నారు. ఈ తరహా ఘటనలను నివారించడానికి అధికారులు జారీ చేసే అన్ని భద్రతా సూచనలను పాటించాలని సూచించింది.

డీజీపీ డాక్టర్ జితేందర్, IPS., నల్గొండ SP శరత్ చంద్రపవర్, IPS., నాగర్‌కర్నూల్ SP వైభవ్ గైక్వాడ్, IPS. లీడర్‌షిప్‌ను ప్రశంసించారు. డీజీపీ డేవరకొండ, ఆచంపేట DSsP, డిండీ,ఆచంపేట CIs లు చేపట్టిన ధైర్యవంతమైన రెస్క్యూ చర్యలకు కూడా అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..